Homeగాసిప్స్శ్రీముఖి షో ఇక మొదలుకానుంది

శ్రీముఖి షో ఇక మొదలుకానుంది

శ్రీముఖి షో ఇక మొదలుకానుంది
శ్రీముఖి షో ఇక మొదలుకానుంది

బిగ్ బాస్ లోకి వెళ్ళకముందు నుండే శ్రీముఖి పాపులర్ యాంకర్. పటాస్ షో, ఇంకా మరికొన్ని ఈవెంట్స్ చేస్తూ చాలా బిజీగా ఉండే శ్రీముఖి బిగ్ బాస్ షో లోకి వెళ్లడంతో చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇంత బిజీగా ఉండే శ్రీముఖి ఎందుకు 100 రోజుల పాటు సాగే బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి ఒప్పుకుందన్నది అర్ధం కాలేదు. అయితే శ్రీముఖి చాలా తెలివైన డీల్ చేసుకుని ఈ షో కు వెళ్లిందని రూమర్స్ ఉన్నాయి. బిగ్ బాస్ మొదలుకాకముందే ఈ షో లో ఫైనల్స్ కు వెళ్లేలా శ్రీముఖి మానేజ్మెంట్ తో డీల్ చేసుకుందిట. ఏం జరిగినా సరే ఫైనల్స్ లో తాను ఉండాలన్న నిబంధనమీదే ఈ షోలోకి అడుగుపెట్టినట్లు సమాచారం. దాంతో పాటు అందరికంటే ఎక్కువ పారితోషికం తీసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఆమెకు ఒక్క రోజుకే లక్ష రూపాయల దాకా పారితోషికం ముట్టినట్లు తెలుస్తోంది. ఇలా 105 రోజుల పాటు అంటే కోటి పైనే తీసుకుందిట. టాక్స్ లు అన్నీ పోనూ దాదాపు 80 లక్షల దాకా వచ్చినట్లు సమాచారం. మరోవైపు స్టార్ మా కూడా ఈ ఒప్పందం చేసుకునేముందు బిగ్ బాస్ అయ్యాక శ్రీముఖితో పలు ప్రోగ్రామ్స్ ను ప్లాన్ చేసారు. బిగ్ బాస్ అవ్వగానే శ్రీముఖి యాంకర్ గా ఒక కొత్త షో చేయడానికి కూడా అగ్రిమెంట్ తీసుకున్నారట. ఇలా అటు స్టార్ మా కు ఇటు శ్రీముఖికి ఇద్దరికీ కలిసొచ్చేలా విన్ – విన్ సిట్యుయేషన్ లో డీల్ జరిగింది.

అయితే పాపులారిటీ ఎక్కువున్న శ్రీముఖి బిగ్ బాస్ టైటిల్ గెలుస్తుందనుకున్నారు కానీ అనూహ్యంగా మాస్ లో క్రేజ్ సంపాదించుకుని రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ ఎగరేసుకుని వెళ్ళిపోయాడు. దీంతో శ్రీముఖి మహిళా అయినందువల్లే తనకు టైటిల్ రాలేదని ,లేడీ కార్డు కూడా వాడింది కానీ దాని వల్ల పెద్దగా ఉపయోగం లేదు. బిగ్ బాస్ అవ్వగానే మాల్దీవ్స్ చెక్కేసి వారం పాటు ఫ్యామిలీ, స్నేహితులతో చిల్ అయిపోయిన శ్రీముఖి ఇప్పుడు మళ్ళీ ముఖానికి రంగు వేసుకుంటోంది. శ్రీముఖిని హోస్ట్ గా పెట్టి స్టార్ మా ప్లాన్ చేసిన షో షూటింగ్ ఇప్పటికే మొదలైపోయింది. దీనికి సంబంధించిన ప్రోమో కూడా స్టార్ మా విడుదల చేసింది. శ్రీముఖి తనకు అలవాటైన తరహాలో గట్టిగా అరిచేసి మళ్ళీ మీ ముందుకు వస్తున్నా స్టార్ మా తో అని చెప్పి సస్పెన్స్ లో ఉంచింది. అదే ఏ రకమైన షో నో, రియాలిటీ షో నా, గేమ్ షో నా అన్నది క్లారిటీ లేదు. మొత్తానికి రాహుల్ సిప్లిగంజ్ కంటే శ్రీముఖి బిగ్ బాస్ వల్ల ఎక్కువ లాభపడినట్లు తెలుస్తోంది. ముందే డీల్స్ మాట్లాడుకోవడం వల్ల షో తర్వాత నెగటివిటీ వచ్చినా పెద్ద బాధపడాల్సిన అవసరం లేకుండా పోయింది. పైగా క్రేజ్ కోసం బిగ్ బాస్ అవ్వగానే అందరికీ ఇంటర్వ్యూలు ఇవ్వక్కర్లేకుండా హాయిగా ఎంజాయ్ చేసుకుని మళ్ళీ వర్క్ మొదలుపెడుతుంది శ్రీముఖి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All