
పటాస్ షో తో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ శ్రీముఖి. జులాయి మూవీ తో తెలుగు ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన ఈమె..పలు సినిమాల్లో హీరోయిన్ గా , సైడ్ క్యారెక్టర్ గా నటించింది. కానీ బిజీ నటి మాత్రం కాలేకపోయింది. ఈ తరుణంలో బుల్లితెర ఫై యాంకర్ గా అడుగుపెట్టి ప్రస్తుతం వరుస షోస్ తో రాణిస్తుంది. అలాగే వెండితెర ఛాన్సులు వచ్చిన కాదనకుండా చేస్తుంది. రీసెంట్ గా ‘క్రేజీ అంకుల్స్’, ‘మాస్ట్రో’ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ మూవీ లో నటిస్తుంది.
ఇదిలా ఉంటె ఈ భామ సోషల్ మీడియా లో నిత్యం యాక్టివ్ గా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు సరికొత్త ఫోటోషూట్స్ తో అలరిస్తూ ఉండే ఈ భామ ..తాజాగా చీరకట్టులో అదిరిపోయే ఫొటోస్ ను షేర్ చేసి ఆకట్టుకుంది. సంప్రదాయానికి ప్రతీక అయిన చీరకట్టులోనూ కుర్రకారుకు ట్రీట్ ఇస్తున్నదని కొందరు నెటిజన్లు అంటున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
Saregamapa ?
Tonight on @ZeeTVTelugu ✨#sreemukhi #saregamapa pic.twitter.com/nuRMrsPGWA— SreeMukhi (@MukhiSree) April 10, 2022