Homeటాప్ స్టోరీస్శర్వానంద్ కు తమ్ముడిగా శ్రీవిష్ణు

శర్వానంద్ కు తమ్ముడిగా శ్రీవిష్ణు

srikanth addala multistarrer movie with sharwanand and sri vishnuఅప్పట్లో ఒకడుండేవాడు , ఉన్నది ఒకటే జిందగీ , మెంటల్ మదిలో వంటి చిత్రాలతో జోరు మీదున్న యువ హీరో శ్రీవిష్ణు తాజాగా శర్వానంద్ తమ్ముడిగా నటించడానికి ఒప్పుకున్నాడట ! శర్వానంద్ వరుస విజయాలతో మంచి జోరు మీదున్నాడు అయితే తాజాగా బ్రహ్మోత్సవం లాంటి డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు . బ్రహ్మోత్సవం డిజాస్టర్ తర్వాత శ్రీకాంత్ అడ్డాల చాలామంది హీరోల చుట్టూ తిరిగాడు కానీ వాళ్లంతా భయపడిపోయారు ఈ దర్శకుడికి .

కట్ చేస్తే కొంతకాలం గడిచింది అలాగే శర్వానంద్ ని మెప్పించే కథ తో అప్రోచ్ అయ్యాడు ఇంకేముంది శ్రీకాంత్ అడ్డాల చెప్పిన కథ నచ్చడంతో వెంటనే ఒప్పేసుకున్నాడు పైగా ఈ చిత్రాన్ని నిర్మించేది గీతా ఆర్ట్స్ కాబట్టి సంతోషంగా ఒప్పుకున్నాడు . అన్నదమ్ముల కథతో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో శర్వానంద్ తమ్ముడిగా ఎవరైతే బాగుంటారు అని వెతికి వెతికి చివరకు శ్రీవిష్ణు ని ఎంపిక చేశారట .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All