
కింగ్ నాగార్జునతో `గగనం, అడివి శేష్‌తో క్షణం, రానాతో ఘాజీ చిత్రాన్ని అందించిన మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రస్తుతం మెగాస్టార్‌తో `ఆచార్య`, నాగార్జునతో `వైల్డ్ డాగ్` వంటి విభిన్నమైన చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కంటెంట్ వున్న చిత్రాల్ని అందిస్తూ అభిరుచిగల నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకున్న ఈ సంస్థ తాజాగా శ్రీవిష్ణు హీరోగా ప్రొడక్షన్ నెం. 9 ని ప్రారంభించింది. `జోహార్` ఫేమ్ తేజ మార్ని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ మూవీ గురువారం సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఇందులో శ్రీవిష్ణుకు జోడీగా అమృతా అయ్యర్ నటిస్తోంది. ముహూర్తపు సన్నివేశానికి యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ క్లాప్ నివ్వగా సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. యంగ్ డైరెక్టర్ స్వరూప్ ఆర్.ఎస్.జె గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ చిత్రానికి ఎన్.ఎమ్. పాషా సహనిర్మాత. సుధీర్‌వర్మ పి డైలాగ్స్ రాస్తున్నారు. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రానికి ప్రియదర్శన్ బాలసుబ్రమణియన్ సంగీతం అందిస్తున్నారు. జగదీష్ చీకటి ఛాయాగ్రహణం సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి యాక్షన్ : రామ్ సుంకర, సాహిత్యం : చఐతన్యప్రసాద్, కీలక పాత్రల్లో నరేష్, శివాజీరాజా, దేవీశ్రీప్రసాద్, రంగస్థలం మహేష్, రాజ్‌కుమార్ చౌదరి, చైతన్య తదితరులు నటిస్తున్నారు.