
మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తుందంటే..అగ్ర హీరోలు సైతం తమ సినిమాల విడుదలను ఆపేస్తారు. అలాంటిది శ్రీవిష్ణు మాత్రం చిరంజీవికి పోటీగా బరిలోకి దిగుతున్నాడు. ఇప్పుడే ఇదే ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అవుతుంది. ‘బాణం’ ఫేమ్ చైతన్య దంతులూరి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా భళా తందనాన సినిమా తెరకెక్కింది. క్యాథరిన్ ట్రెసా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో ‘కేజీఎఫ్’ ఫేమ్ గరుడ రామచంద్రరాజు విలన్ గా కనిపించనున్నారు. ఇప్పటికే ‘భళా తందనాన’ సినిమా నుంచి విడుదలైన టీజర్ మరియు రెండు లిరికల్ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ ను ఏప్రిల్ 30 న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపి షాక్ ఇచ్చారు. వేసవి సెలవులను , రంజాన్ ను క్యాష్ చేసుకోవాలని ఆ తేదీని ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తుంది. కాకపోతే ఏప్రిల్ 29న చిరంజీవి – రాంచరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ సినిమా విడుదలవుతోంది. మెగా మూవీకి పోటీగా నిలబడి ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో.. శ్రీ విష్ణు కెరీర్ కు ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.