Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ బయోపిక్ పై కామెంట్ చేసిన శ్రీ రెడ్డి

ఎన్టీఆర్ బయోపిక్ పై కామెంట్ చేసిన శ్రీ రెడ్డి

Actress Sri Reddy surprising comments on NTR biopic
Sri Reddy

వివాదాస్పద భామ శ్రీ రెడ్డి ఎన్టీఆర్ బయోపిక్ పై కామెంట్ చేసి సంచలనం సృష్టించింది . ఈ భామ కామెంట్ అంటే నెగెటివ్ కామెంట్ అని అనుకుంటారేమో పాజిటివ్ గా చాలా పాజిటివ్ గా కామెంట్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది . ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది ని టార్గెట్ చేసిన శ్రీ రెడ్డి నందమూరి ఫ్యామిలీ ని మాత్రం పల్లెత్తు మాట అనలేదు ఇంతవరకు పైగా బాలయ్య ని అలాగే ఎన్టీఆర్ ని పొగుడుతూ కామెంట్స్ చేసింది . ఇక ఇప్పుడేమో ఎన్టీఆర్ బయోపిక్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నామని , ఇది కేవలం నందమూరి వారి సినిమా కాదని ఇది మా ఎన్టీవోడి ( ఎన్టీఆర్ ని ముద్దుగా ఎన్టీవోడు అని పిలుచుకుంటారు  ) సినిమా అని బాక్స్ లు బద్దలయ్యేలా చేస్తామని అంటోంది .

తెలుగు జాతి పౌరుషాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు నందమూరి తారకరామారావు . సినిమారంగంలో అలాగే రాజకీయ రంగంలో ప్రభంజనం సృష్టించిన ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా తెరకెక్కిన విషయం తెలిసిందే . నిన్న ఆడియో వేడుక అంగరంగ వైభవంగా జరిగింది . క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి , విష్ణు లతో కలిసి బాలయ్య నిర్మించడం విశేషం . అయితే నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేసే శ్రీ రెడ్డి ఎన్టీఆర్ బయోపిక్ పై పాజిటివ్ కామెంట్స్ చేయడం కూడా సంచలనంగా మారింది .

- Advertisement -

English Title: Actress Sri Reddy surprising comments on NTR biopic

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All