Homeటాప్ స్టోరీస్మళ్ళీ రోడ్డు కెక్కిన శ్రీరెడ్డి

మళ్ళీ రోడ్డు కెక్కిన శ్రీరెడ్డి

sri reddy supports to MGNREGA workersవివాదాస్పద నటి శ్రీరెడ్డి మళ్ళీ రోడ్డెక్కింది అయితే ఈసారి ఉపాధి కూలీలకు మద్దతుగా రోడ్డుకెక్కింది . శ్రీరెడ్డి శ్రీశైలం వెళ్తున్న సమయంలో ఎర్రగొండ పాలెం మండలం గురిజేపల్లి సమీపంలో ఉపాధి కూలీలు ధర్నా చేస్తున్నారు , దాంతో శ్రీరెడ్డి తన కారుని ఆపేసి కూలీలకు మద్దతుగా ధర్నాలో పాల్గొంది . వివాదాస్పద నటి శ్రీరెడ్డి తమకు మద్దతు ప్రకటించడమే కాకుండా ధర్నాలో పాల్గొనడంతో ఆశ్చర్య పోయారు అలాగే సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు .

తెలుగు చలనచిత్ర రంగంలో ఉన్న కాస్టింగ్ కౌచ్ పై సంచలన ఆరోపణలు చేసి నెల రోజుల పాటు టాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసిన భామ శ్రీరెడ్డి . పలువురు ప్రముఖులపై ఆరోపణలు చేసి వాళ్ళకు నిద్ర లేకుండా చేసింది శ్రీరెడ్డి . అలాంటి శ్రీరెడ్డి ఉపాధి కూలీలకు మద్దతు ఇచ్చి వాళ్లతో ముచ్చటించడంతో చాలా సంతోషించారు . కొద్దిసేపు వాళ్లతో మాట్లాడిన తర్వాత తిరిగి వెళ్ళిపోయింది శ్రీరెడ్డి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All