
వివాదాస్పద భామ శ్రీ రెడ్డి మరోసారి సమంత పై ట్వీట్ చేసి సంచలనం సృష్టించింది . మా ఆయన్ని మాత్రమే ఓ బేబీ సక్సెస్ మీట్ కి పిలిచింది కేక్ తినిపించింది ,నన్ను పిలవలేదు నేను హర్ట్ అయ్యా ! అని ఓ పోస్ట్ పెట్టేసింది శ్రీ రెడ్డి ఫేస్ బుక్ లో . ఇంతకీ శ్రీ రెడ్డి ఆయన అంటే ఎవరో తెలుసా …… రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ .
శ్రీ రెడ్డి దగ్గుబాటి అభిరాం ని తన భర్తగా సంబోధిస్తుంది , అలాగే సురేష్ బాబు ని మామయ్య అంటూ రానా ని బావ , వెంకటేష్ ని చినమామ అంటూ వాళ్ళకు చుక్కలు చూపిస్తోంది . కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసి టాలీవుడ్ లో ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే . అభిరాం తో సన్నిహితంగా ఉన్న ఫోటోలను రిలీజ్ చేసి సంచలనం సృష్టించింది శ్రీ రెడ్డి . ఇక తాజాగా సమంత నటించిన ఓ బేబీ చిత్రం సక్సెస్ అయిన నేపథ్యంలో దగ్గుబాటి అభిరాం కు కేక్ తినిపిస్తున్న ఫోటో షేర్ చేసి కామెంట్ చేసింది శ్రీ రెడ్డి .