Homeటాప్ స్టోరీస్ప్రభాస్ నా డ్రీమ్ బోయ్ అంటున్న శ్రీ రెడ్డి!

ప్రభాస్ నా డ్రీమ్ బోయ్ అంటున్న శ్రీ రెడ్డి!

Sri Reddy
Sri Reddy

కొద్దిరోజులుగా శ్రీరెడ్డి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. రెండు మూడు సంవత్సరాలుగా ఆమె బాగా ఫేమస్ అయిపోయింది. దీంతో శ్రీరెడ్డి ఫాలోవర్లు కూడా అరవై లక్షలకు పైగానే ఉన్నారు. ఇక, తాజాగా జరుగుతున్న వ్యవహారాలతో ఆమె చర్చనీయాంశం అవుతోంది. ఈ కారణంగానూ ఆమె ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంది. ఈ కారణంగా హాట్ టాపిక్ అయింది. తనపై ఎన్ని విమర్శలు వచ్చినా ఆమె మాత్రం అస్సలు తగ్గడం లేదు.

ఇప్పటికే ఎంతో మంది టాలీవుడ్ హీరోలపై పోస్టులు పెట్టిన శ్రీరెడ్డి.. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌పై ఫోకస్ చేసింది. ‘ప్రభాస్ ప్రవర్తన చాలా కూల్‌గా, మర్యాదపూర్వకంగా ఉంటుంది. అదే సమయంలో అతడు కూర్చునే విధానం రాయల్‌గా కనిపిస్తుంది. డ్రీమ్ బాయ్.. నిన్ను చూసి గర్వంగా ఫీలవుతున్నాను’ అంటూ ఆ పోస్టులో పేర్కొంది. శ్రీరెడ్డి ఎంతో మంది హీరోలపై నెగెటివ్ కామెంట్స్ చేసింది. అయితే, మొదటిసారి ప్రభాస్‌పై మాత్రం పాజిటివ్‌గా మాట్లాడింది. దీంతో ఈ పోస్ట్ చర్చనీయాంశం అయింది.

- Advertisement -

కొద్దిరోజుల క్రితం ఫేస్‌బుక్ లైవ్‌లోకి వచ్చిన శ్రీరెడ్డి.. ప్రభాస్ సినిమా సాహోపైనా వ్యాఖ్యలు చేసింది. ప్రభాస్ తన ‘డ్రీమ్ బాయ్’ అని పేర్కొంటూ.. సాహో సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. దీంతో అందరూ ప్రభాస్‌పై శ్రీరెడ్డి మనసు పారేసుకుందని కామెంట్లు చేశారు. అప్పటి నుంచి ఆమెకు ప్రభాస్ అభిమానులు మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి తన ఫేస్‌బుక్ ఖాతాలో ‘సాహో ఎలా ఉంది..? ఇది హిట్టేనా..?’ అని పోస్ట్ చేసింది.

ఆ వెంటనే శ్రీరెడ్డి మరో పోస్ట్ చేసింది. ‘పీఈకే ఫ్యాన్స్ గొర్రెల్లారా మారరా..? ఏంట్రా మీరు ప్రభాస్ మూవీ మీద పడి ఏడుస్తున్నారు..?’ అని అందులో పేర్కొంది. ఈ పోస్టులో ఆమె అన్న హీరో పవన్ కల్యాణే అని అర్థం అవుతోంది. గతంలోనూ ఆమె ఇదే తరహాలో పవన్‌పై, ఆయన అభిమానులపై కామెంట్లు చేసింది. దీంతో శ్రీరెడ్డిపై పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, ఇద్దరు హీరో అభిమానుల మధ్య గొడవ జరిగేలా ఆమె చేసిన పోస్ట్ హాట్ టాపిక్ అవుతోంది.. ఇది ఎంతవరకు ముదురుతుందో వెయిట్ అండ్ సి..!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All