Homeటాప్ స్టోరీస్నాని భాగోతం బయటపెడతానంటున్న శ్రీ రెడ్డి

నాని భాగోతం బయటపెడతానంటున్న శ్రీ రెడ్డి

sri reddy responds nani legal noticesపుట్టినరోజు ని ఎంజాయ్ చేయాలనీ హైదరాబాద్ నుండి వెళ్లిపోతున్న సమయంలో నాని నాకు లీగల్ నోటీసులు పంపించినట్లు తెలిసిందని అయితే నేను మళ్ళీ గురువారం హైదరాబాద్ వస్తాను అప్పుడు నాని బాగోతం అంతా బయటపెడతానని సవాల్ విసురుతోంది వివాదాస్పద నటి శ్రీ రెడ్డి . జనాల దృష్టిలో ఎక్కడ పరువు పోతుందో అని నాకు లీగల్ నోటీసులు పంపించి ఉంటావ్ ! మనిద్దరి వ్యవహారం గురించి నీ భార్యకు చెప్పావా ? నీ భార్య కు అన్ని విషయాలు చెబుతాను అంటూ నాకు చెప్పావ్ కదా ! అంటూ సోషల్ మీడియాలో పేర్కొంది శ్రీ రెడ్డి .

అంతేకాదు నాని ని వణికించే పోరాటం చేస్తానని , నాని పై నేను చేసే పోరాటం చూసి మిగతావాళ్ళు నిలువెల్లా వణికిపోవడం ఖాయం . బాధిత మహిళలు ఎలా ఫైట్ చేయాలో నా పోరాటం ద్వారా చూపిస్తాను నాని …….. ధర్మానికి నిజంగా బలం ఉంటే ఆ దేవుడు నిన్ను తప్పకుండా శిక్షిస్తాడు అంటూ నాని పై పోరాటానికి సిద్ధం అవుతోంది శ్రీ రెడ్డి . అయితే ఈరోజు శ్రీ రెడ్డి పుట్టినరోజు కావడంతో రెండు రోజుల గ్యాప్ ఇస్తోంది , గురువారం తిరిగి హైదరాబాద్ వచ్చాకా నాని కి చుక్కలు చూపిస్తానని అంటోంది శ్రీ రెడ్డి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts