
నిత్యం ఏదొక వివాదాస్పద కామెంట్స్ తో వార్తల్లో నిలిచే శ్రీ రెడ్డి..తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీ లో రామ్ చరణ్ డాన్స్ ఫై కామెంట్స్ చేసి మెగా అభిమానుల్లో ఆగ్రహం నింపింది. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో రామ్ చరణ్ , ఎన్టీఆర్ లు హీరోలుగా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సాధించింది. కేవలం రెండు వారాల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.1000 కోట్లు సాధించి వార్తల్లో నిలిచింది. ఈ సినిమా సాధించిన విజయాన్ని చూసి సామాన్య ప్రేక్షకులు సహా సెలబ్రిటీలు సైతం సినిమాపై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. ఈ తరుణంలో శ్రీ రెడ్డి మూవీ ఫై స్పందించి ..చరణ్ డాన్స్ ఫై నెగిటివ్ కామెంట్స్ చేసి అభిమానుల్లో ఆగ్రహం తెప్పించింది.
‘‘నాటు నాటు సాంగ్ లో డాన్స్ తో పాటు లిరిక్స్ కూడా చాలా నాటుగా ఉంది, డాన్స్ లో యంగ్ టైగర్ స్పీడ్ ని రామ్ చరణ్ అందుకోలేకపోయాడు, పాపం’’ అంటూ పగలబడి నవ్వే ఎమోజీని షేర్ చేసింది. అంతే కాదండోయ్.. ఎన్టీఆర్ – రామ్ చరణ్ కలిసి నాటు నాటు సాంగ్‌కు స్టెప్ వేసిన ఫొటోను కూడా ఆమె తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. స్టార్ హీరోలిద్దరూ ఫ్రెండ్లీగా ఉన్న సమయంలో శ్రీరెడ్డి తనదైన కామెంట్స్‌తో స్టార్స్ ఫ్యాన్స్ మధ్యలో గొడవ పెట్టే ప్రయత్నం చేసింది. కానీ ఫ్యాన్స్ ఈమె పోస్ట్ ను ఏమాత్రం పట్టించుకోలేదు.