Homeప్రెస్ నోట్స్‘అథర్వ’ నుంచి ‘చాంగు చాంగురే’ పాటను విడుదల చేసిన క్రేజీ హీరోయిన్ శ్రీలీల

‘అథర్వ’ నుంచి ‘చాంగు చాంగురే’ పాటను విడుదల చేసిన క్రేజీ హీరోయిన్ శ్రీలీల

‘అథర్వ’ నుంచి ‘చాంగు చాంగురే’ పాటను విడుదల చేసిన క్రేజీ హీరోయిన్ శ్రీలీల
‘అథర్వ’ నుంచి ‘చాంగు చాంగురే’ పాటను విడుదల చేసిన క్రేజీ హీరోయిన్ శ్రీలీల

కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం అథర్వ. ఈ సినిమాకు మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుభాష్ నూతలపాటి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, సాంగ్స్, పోస్టర్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడంతో మూవీపై బజ్ క్రియేట్ అయింది.

ప్రొడక్షన్స్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం రిలీజ్‌కు సిద్ధమైంది. డిసెంబర్ 1న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది.

- Advertisement -

అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ‘చాంగు చాంగురే’ పాటను టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల విడుదల చేశారు. శ్రీ చరణ్ పాకాల బాణీ.. కాసర్ల శ్యామ్ సాహిత్యం.. యామినీ ఘంటసాల గాత్రం.. భాను మాస్టర్ కొరియోగ్రఫీ పాటకు అందాన్ని తీసుకొచ్చాయి. చూడటానికి, వినడానికి ఈ పాట ఎంతో ఆహ్లాదకరంగా ఉంది.

సస్పెన్స్, క్రైమ్ జానర్లో మూవీ అంటే ఆడియన్స్‌కు ఎప్పుడూ ఓ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ రెండు జానర్లకు రొమాంటిక్, లవ్ ట్రాక్‌ను జతపరిచి యూత్‌ను ఆకట్టుకునేలా తెరకెక్కించిన మూవీ అథర్వ. ప్రస్తుతం ఈ మూవీపై అందరిలోనూ భారీ స్థాయిలో అంచనాలున్నాయి.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All