Homeటాప్ స్టోరీస్రెండో పెళ్ళికి సిద్దమైన రజనీకాంత్ కూతురు

రెండో పెళ్ళికి సిద్దమైన రజనీకాంత్ కూతురు

Soundarya Rajinikanth to tie the knot in January 2019సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు రెండో పెళ్ళికి సిద్ధమైంది . రజనీకాంత్ కు ఇద్దరు కూతుర్లు అన్న విషయం తెలిసిందే . పెద్ద కూతురు ఐశ్వర్య కాగా ఆమెని హీరో ధనుష్ పెళ్లి చేసుకున్నాడు . ఇక చిన్న కూతురు సౌందర్య , ఈమె రజనీ నటించిన కొచ్చాడైయాన్ చిత్రానికి దర్శకత్వం వహించింది , ఆ సినిమా డిజాస్టర్ కాగా ధనుష్ హీరోగా వి ఐ పి 2 అనే చిత్రానికి దర్శకత్వం వహించింది మళ్ళీ . ఈ సినిమా కూడా ప్లాప్ అయ్యింది దాంతో ప్రస్తుతానికి డైరెక్షన్ ని పక్కన పెట్టింది . అయితే సౌందర్య కు ఇంతకుముందే పెళ్లి అయ్యింది . 2010 లో అశ్విన్ రాంకుమార్ ని పెళ్లి చేసుకుంది సౌందర్య . ఈ ఇద్దరికీ సంతానం కూడా అయితే వెంటనే ఇద్దరిమధ్య విబేధాలు రావడంతో వేరు వేరుగా ఉన్నారు ఈ ఇద్దరినీ కలపడానికి రజనీకాంత్ చేయని ప్రయత్నం లేదు అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా రాజీ కి సౌందర్య ఒప్పుకోకపోవడంతో విడాకులు తీసుకున్నారు .

కట్ చేస్తే ఇప్పుడు విశాకన్ వనంగమూడి ని పెళ్లి చేసుకోవడానికి సిద్దమయ్యింది సౌందర్య . తమిళనాట చిన్న చిన్న పాత్రల్లో నటిస్తున్న నటుడు , బిజినెస్ మెన్ కూడా ఈ విసాకన్ . కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో సౌందర్య – విసాకన్ ల వివాహ నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది . ఇక పెళ్లి 2019 జనవరిలో జరుగనున్నట్లు తెలుస్తోంది .

- Advertisement -

English Title: Soundarya Rajinikanth to tie the knot in January 2019

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All