
సోనుసూద్.. లాక్‌డౌన్ టైమ్ కరోనా తరువాత ఆ స్థాయిలో వినిపించిన పేరిది. దేశ వ్యాప్తంగా ఎక్కడ సమస్య వుంటే అక్కడ నేనున్నానని ముందుకొచ్చి ఎంతో మందికి తన వంతు సేవ చేశారు సోనుసూద్. దీంతో దేశ వ్యాప్తంగా ఆయన పేరు మారుమ్రోగిపోయింది. వేలు.. లక్షల సంఖ్యలో ఆయనకు అబ్యర్ధనలు మొదలయ్యాయి. చిన్నా పెద్దా అని తేడా లేకుండా ఆయనకు ఫ్యాన్స్ అయిపోయారు. వెండితెరపై విలనిజాన్ని పండించిన సోనుసుద్ రియల్ లైఫ్‌లో హీరో అయిపోయాడు.
దీంతో ఆయనకు భారీ డిమాండ్ ఏర్పడింది. సోను క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలని చాలా మంది తెలుగు నిర్మాతలు ఆయన కోసం క్యూ కడుతున్నారట. అయితే వారికి సోనుసుద్ గట్ఇ షాకి ఇచ్చినట్టు తెలిసింది. గతంలో ఓ సినిమాకు 2 కోట్లు తీసుకునే సోనుసుద్ లాక్‌డౌన్ పుణ్యమా అని ఆ మొత్తాన్ని డబుల్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
3.5 కోట్ల నుంచి 4 కోట్లు ఇస్తేనే నటిస్తానని డిమాండ్ చేస్తున్నాడట. సీనియర్ హీరోతో ఊర మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ని రూపొందిస్తున్న ఓ డైరెక్టర్ కీలక విలన్ పాత్ర కోసం సోనుసుద్‌ని సంప్రదించాడట. ఓల్డ్ రెమ్యునరేషన్‌కే అతన్ని ఫిక్స్ చేసుకోవాలని ప్రయత్నిస్తే సోను సదరు డైరెక్టర్‌కి గట్టి ఝలక్ ఇచ్చినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.