
అరుంధతి చిత్రంలో పశుపతి గా ప్రేక్షకులను విలన్ గా మెప్పించిన సోనూసూద్…కరోనా టైములో రియల్ హీరో అనిపించుకున్నాడు. సొంత డబ్బులతో ఎంతోమందిని కాపాడి..అందరి ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం ఈయన చిరంజీవి – చరణ్ ల కలయికలో తెరకెక్కిన ఆచార్య మూవీ లో బసవ గా కనిపించబోతున్నాడు. ఈ సందర్భంగా సోనుసూద్ ట్విట్టర్ వేదికగా ‘ఆచార్య’ పిక్చర్ కు సంబంధించిన ఫొటోలు షేర్ చేశాడు.
అవి చూసి నెటిజన్లు, సినీ అభిమానులు వాహ్..అంటున్నారు. పిలకతో సోనుసూద్..అలా ముఖంపైన కుంకుమతో , నుదుటన బొట్టు పెట్టుకుని నయా అవతార్ లో చాలా చక్కగా ఉన్నారు. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మ్యాట్నీ మూవీస్ బ్యానర్ ఫై నిరంజన్ రెడ్డి నిర్మిస్తుండగా..పూజా హగ్దే హీరోయిన్ గా నటించింది.
See you soon ? #acharya pic.twitter.com/sXOJVzXFkQ
— sonu sood (@SonuSood) April 27, 2022