
రాధే శ్యామ్ మూవీ తో రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్..ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో ఆదిపురుష్ ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ 3డీ ఫార్మాట్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కృతి సనన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈమూవీని రామాయణ ఇతిహాసం ఆధారంగా మోడ్రన్ రామాయణంగా అత్యంత భారీ స్థాయిలో భారతీయ తెరపై కనీ వినీ ఎరుగని విధింగా తెరకెక్కిస్తున్నారు.
గ్రాఫిక్స్ ప్రధానంగా రూపొందుతున్న ఈ మూవీలో లంకాధిపతి రావణ్‌గా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. కాగా ఈ మూవీ లో సోనాల్ చౌహాన్ కూడా నటిస్తుందిట. ఈ విషయాన్ని ఓ బాలీవుడ్ న్యూస్ పోర్టల్ కి సోనాల్ తెలిపింది.
ఇందులో నా పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పటివరకూ పోషించిన పాత్రలకు పూర్తి భిన్నం. వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ ఎంతో కొత్తగా ఉంది. ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే రోల్ ఇది. `రామాయణం` అందరికీ తెలిసిన కథ కాబట్టి నా పాత్ర సులభంగా రీచ్ అవుతుందని సోనాల్ ధీమా వ్యక్తం చేసింది. మొత్తానికి సోనాల్ చౌహాన్ కి కెరీర్ లోనే చెప్పుకోదగ్గ రోల్ వచ్చిందని అంత మాట్లాడుకుంటున్నారు.
రూ. 400 కోట్లు భారీ బడ్జెట్‌తో టి – సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్ మరియు రాజేష్ నాయర్ కలిసి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న రిలీజ్ చేయనున్నారు.