
నటసింహం బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్లో తెరకెక్కిన ‘లెజెండ్’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఉత్తరప్రదేశ్ బ్యూటీ సోనాల్ చౌహన్. ఈమె నటించిన మొదటి చిత్రమే బ్లాక్ బస్టర్ కావడంతో.. సోనాల్ కు తెలుగులో మంచి అవకాశాలే వచ్చాయి. రామ్ హీరోగా వచ్చిన ‘పండగ చేస్కో’, కళ్యాణ్ రామ్ ‘షేర్’, ఆర్య, అనుష్క ల ‘సైజ్ జీరో’, ‘డిక్టేటర్’,’రూలర్’ వంటి చిత్రాల్లో నటించి అందాలు ఆరబోసింది. అయితే నటిగా ఈమెను గుర్తు పెట్టుకునేంతలా సరైన పాత్రల్ని ఈమె ఎంపిక చేసుకోలేదు.
దాంతో ఈ అమ్మడికి బిజీ గా మారే ఛాన్సులు రావడం లేదు. చాల గ్యాప్ తర్వాత ప్రస్తుతం నాగార్జున నటిస్తున్న ఘోస్ట్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది. ఇది కూడా కాజల్ తప్పుకోవడం తో ఈమెకు ఛాన్స్ దక్కింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దుబాయ్ లో జరుగుతుంది. ఈ చిత్రంలో కూడా అందాల ఆరబోత గట్టిగానే చేసినట్లు మేకింగ్ స్టిల్స్ చూస్తే అర్ధమవుతుంది. ఇదిలా ఉంటె సోషల్ మీడియా లో నిత్యం యాక్టివ్ గా ఉంటూ హాట్ హాట్ పిక్స్ ను షేర్ చేసే ఈమె తాజాగా స్విమింగ్ పూల్ లో హాట్ హాట్ గా ఉన్న పిక్ ను షేర్ చేసి ఫాలోయర్స్ ను కట్టిపడేసింది. ప్రస్తుతం ఈ పిక్ వైరల్ గా మారింది.