Homeటాప్ స్టోరీస్సోనాక్షి బాత్రూమ్ లో ఫ్యాన్ ..పెళ్లి చేసుకోకపోతే చనిపోతే అంటూ బెదిరింపు

సోనాక్షి బాత్రూమ్ లో ఫ్యాన్ ..పెళ్లి చేసుకోకపోతే చనిపోతే అంటూ బెదిరింపు

Sonakshi Sinha is petrified as fan proposes to her
Sonakshi Sinha is petrified as fan proposes to her

దబాంగ్ బ్యూటీ సోనాక్షి సిన్హా కు షాక్ ఇచ్చాడు ఓ అభిమాని. సోనాక్షి సిన్హా బాత్రూం లో ఉన్న ఓ అభిమాని..తనను పెళ్లి చేసుకోకపోతే చనిపోతే అంటూ కత్తితో బెదిరించడం ..సోనాక్షి సిన్హా కు చెమటలు పట్టేలా చేసింది. దబాంగ్ మూవీ తో బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ భామ..మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని ఆ తర్వాత పలు సినిమాలు చేసింది. కానీ స్టార్ హీరోయిన్ గా కానీ బిజీ హీరోయిన్ గా కానీ అవ్వలేకపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియా లో హాట్ హాట్ ఫోటో షూట్స్ తో అలరిస్తున్న వస్తుంది.

తాజాగా ఈమె ది ఖత్రా ఖత్రా షోలో పాల్గొనేందుకు వెళ్లిన సోనాక్షి.. తన వ్యానిటీ వ్యాన్‌ లో ఫోన్‌ చూసుకుంటూ ఉండగా.. ఇంతలో ఓ వ్యక్తి ఆమె అభిమాని అంటూ వాష్‌ రూమ్‌ నుంచి బయటకు వచ్చాడు. ”మేడమ్‌ నేను మీకు పెద్ద అభిమానిని. మీ కోసమే రాత్రి నుంచి ఇక్కడే ఎదురు చూస్తున్నా…అంటూ సోనాక్షి అని పచ్చబొట్టు వేసుకున్న తన చేతిని చూపించాడు. దీంతో ఆశ్చర్యపోయిన సోనాక్షి అతడితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుండగా… సదరు ఫ్యాన్‌ అక్కడ గందరగోళం సృష్టించాడు. అద్దం పై లిప్‌ స్టిక్‌ తో ఐ లవ్‌ యూ సోనా అని రాశాడు. ఇది నా రక్తంతో కూడా రాయగలను.. నన్ను పెళ్లి చేసుకో.. లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని కత్తి ని మెడఫై పెట్టుకొని బెదిరించాడు. దీంతో షాక్‌ గురైన సోనాక్షి కేకలు వేసింది. ఇక్కడితో ఈ షో ప్రోమో వీడియో ముగిసింది. అయితే.. ఇదంతా ఫ్రాంక్‌ వీడియోనా లేక నిజామా అనేది ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది.

- Advertisement -

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All