Homeటాప్ స్టోరీస్సోమనాథ్ ఛటర్జీ కన్నుమూత

సోమనాథ్ ఛటర్జీ కన్నుమూత

somnath chatterjee passed awayలోక్ సభ మాజీ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ (89) అనారోగ్యంతో కన్నుమూశాడు . గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈ రాజకీయ కురువృద్ధుడు ఈరోజు ఉదయం కోల్ కతా లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు . కరడుగట్టిన కమ్యూనిస్ట్ గా పేరుగాంచిన సోమనాథ్ చివరి రోజుల్లో మాత్రం ఆ పార్టీతో విభేదించడం విశేషం . అసోం కు చెందిన ఈ నాయకుడు లోక్ సభ కు పదిసార్లు ప్రాతినిధ్యం వహించడం విశేషం . అలాగే స్పీకర్ గా కూడా వ్యవహరించి లోక్ సభ సభ్యుల మెప్పు పొందాడు సోమనాథ్ ఛటర్జీ .

1929 జులై 25న అసోం తేజ్ పూర్ లో జన్మించాడు సోమనాథ్ , ఉన్నత విద్యాబ్యాసం చేసిన సోమనాథ్ ఛటర్జీ రాజకీయాల్లోకి రాకముందు కోల్ కతా లో న్యాయవాది గా పనిచేసారు . 1968 లో సిపిఎం పార్టీలో చేరి పార్లమెంట్ కు పదిసార్లు ఎన్నికై సంచలనం సృష్టించాడు . 2004 లో ఏర్పడిన యుపిఏ ప్రభుత్వంలో స్పీకర్ గా బాధ్యతలను నిర్వర్తించాడు . యుపిఏ నుండి సీపీఎం వైదొలిగినప్పటికీ స్పీకర్ పదవికి రాజీనామా చేయకపోవడంతో అతడ్ని పార్టీ నుండి బహిష్కరించారు . 2004 నుండి 2009 వరకు లోక్ సభ కు స్పీకర్ గా వ్యవహరించాడు . సోమనాథ్ ఛటర్జీ మరణ వార్త తెలియడంతో పలువురు రాజకీయ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు .

- Advertisement -

English Title: somnath chatterjee passed away

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All