Homeటాప్ స్టోరీస్ఆ హీరో హీరోయిన్ ల మధ్య ఏం జరుగుతోంది ?

ఆ హీరో హీరోయిన్ ల మధ్య ఏం జరుగుతోంది ?

గీత గోవిందం చిత్రంతో సూపర్ హిట్ కొట్టేసిన జంట విజయ్ దేవరకొండరష్మిక మందన్న . ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా రష్మిక మందన్న ని మేడమ్ ……. మేడమ్ అంటూ ఆటపట్టించిన విజయ్ దేవరకొండ తాజాగా డియర్ కామ్రేడ్ కోసం కూడా ఆట పట్టిస్తున్నాడు లిల్లీ మేడమ్ అంటూ……  దాంతో ఈ ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి . 
 
గీత గోవిందం హిట్ అయ్యాక రష్మిక మందన్న కన్నడ హీరో రక్షిత్ తో చేసుకున్న ఎంగేజ్ మెంట్ ని రద్దు చేసుకుంది దాంతో ఆ కన్నడ హీరో ఫ్యాన్స్ రష్మిక పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు చేసారు అప్పుడు విజయ్ దేవరకొండ అండగా నిలిచాడు రష్మిక కు . ఇక ఇప్పుడేమో డియర్ కామ్రేడ్ కోసం ఘాటు రొమాన్స్ చేసారని అది స్క్రీన్ పై మాత్రమే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యేలా కనిపిస్తోంది . 
 
సహజంగానే వరుసగా రెండు సినిమాల్లో కలిసి నటించడం వల్ల కాస్త చనువు ఎక్కువ అవుతుంది . అదే జరిగింది విజయ్ దేవరకొండ – రష్మిక ల విషయంలో కానీ కొంతమంది మాత్రం ఈ ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందని గుసగుసలాడుకుంటున్నారు ఫిలిం నగర్ సర్కిల్లో . 
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All