Homeటాప్ స్టోరీస్ఆద్యంతం నవ్వించే చిత్రమే 'సోడా గోలీసోడా'.. రేపే (ఫిబ్రవరి 16) విడుదల.

ఆద్యంతం నవ్వించే చిత్రమే ‘సోడా గోలీసోడా’.. రేపే (ఫిబ్రవరి 16) విడుదల.

Soda Goli Sodaఎస్.బి క్రియేషన్స్ పతాకంపై చక్రసీద్ సమర్పించు చిత్రం ‘సోడా గోలీ సోడా’. మొత్తం గ్యాస్ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న చిత్రానికి నిర్మాత భువనగిరి సత్య సింధూజ, దర్శకుడు మల్లూరి హరిబాబు. మానస్, నిత్య నరేష్, కారుణ్య  హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రం ఈ 16న  విడుదల కానున్న సందర్భంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు చిత్ర యూనిట్.

 

- Advertisement -

ఈ నేపథ్యంలో నిర్మాత సత్య సింధూజ మాట్లాడుతూ.. సోడా గోలీ సోడా అంతా గ్యాసే.. మా బ్యానర్ లో వస్తున్న మొదటి సినిమా. ఈ 16న అనగా శుక్రవారం  ప్రేక్షకుల ముందుకు రానుంది.. పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా తెరకెక్కించడం జరిగింది. సీనియర్ నటీనటులందరూ మాకు సహకరించారు. మెసేజ్ ఒరియెంటెడ్ సినిమా కనుక తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్ముతున్నా అన్నారు.

 

దర్శకుడు హరిబాబు మాట్లాడుతూ.. కుటుంబం మొత్తం కలసి చూసే వినోదాత్మక చిత్రాన్ని నిర్మించాలనే ఉద్దేశ్యం తోనే సోడా గోలీ సోడా సినిమాను చేయడం జరిగింది… క్లీన్ యూ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా రెండు గంటలు ఆద్యంతం ప్రేక్షకులను నవ్విస్తుంది. ఇండస్ట్రీ లోని కమెడియన్స్ అందరూ ఈ సినిమాలో ఉన్నారు. మానస్, నిత్య, కారుణ్యాలు ఇంత మంచి సినిమాను అంగీకరించి ఇష్టంతో కష్టపడి పనిచేశారు. ఒక మంచి సినిమా విడుదల కావాలంటే నిర్మాతల సహకారం కావాలి. ఆ సపోర్ట్ నాకు అందించిన ఈ చిత్ర నిర్మాతలకు నా  కృతజ్ఞతలను తెలియచేస్తున్నా… అన్నారు.

 

హీరో మానస్ మాట్లాడుతూ.. సీనియర్ కమెడియన్స్ అందరూ ఈ చిత్రంలో  ఉన్నారు. ఇంత మంది సీనియర్ కమెడియన్స్ ఎందుకున్నారో సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది. సినిమా పూర్తి స్ధాయి వినోదాత్మకంగా ఉంటుంది. కుటుంబం మొత్తం హ్యాపీగా కలసి చూసే సినిమా ఇది. పాలకొల్లు అందాలు, హైదరాబాద్ బ్యూటీ ఫుల్ లొకేషన్స్ లలో షూటింగ్ జరుపుకున్నాము. భరత్ మ్యూజిక్ అద్భుతంగా అందించారు. యూనిట్ సపోర్ట్ ఉంటే ఏ సినిమా అయినా బాగొస్తుందని రుజువయ్యింది. ఈ సినిమా కోసం నన్ను సెలెక్ట్ చేసినందుకు దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నా.  ఈ 16న విడుదల అవుతున్నందుకు హ్యాపీగా ఉంది. సినిమాను అందరూ చూసి మమ్మల్ని ఆదరిస్తారని నమ్ముతున్నా.. అన్నారు..

 

కృష్ణ భగవాన్ మాట్లాడుతూ.. ఒక  మంచి కథను ప్రేక్షకులకు అందించాలనే తపనతోనే దర్శక నిర్మాతలు తెరకెక్కించారు. అందరూ కష్టపడి పని చేశారు. నాకు ఈ సినిమాలో మంచి పాత్ర ఇచ్చినందుకు థాంక్స్.. అన్నారు.

హీరోయిన్ నిత్య నరేష్, సహ  నిర్మాత భువనగిరి శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మానస్, నిత్య నరేష్, కారుణ్య, బ్రహ్మానందం, అలీ, కృష్ణ భగవాన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: నందమూరి హరి,

సహ నిర్మాత: భువనగిరి శ్రీనివాస్ మూర్తి, సంగీతం: భరత్, సినిమాటోగ్రఫీ: ముజీర్ మాలిక్, నిర్మాత: భువనగిరి సత్య సింధూజ, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: మల్లూరి హరిబాబు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All