Homeఎక్స్ క్లూసివ్శివాజీరాజా ఆరోపణలు చేసింది ఎవరి మీద

శివాజీరాజా ఆరోపణలు చేసింది ఎవరి మీద

Sivajiraja revealed MAA controversy
Sivaji Raja

ఓ వ్యక్తి వల్ల మా అసోసియేషన్ లో మనస్పర్థలు వచ్చాయని , అతడి అమ్మగారి ని చూసి వదిలేసానని లేకపోతే మరోలా ఉండేదని సంచలన వ్యాఖ్యలు చేసాడు మా అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీరాజా . తాజాగా శివాజీరాజా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించి సంచలనం సృష్టించాడు . శివాజీరాజా కు మా ప్రధాన కార్యదర్శి నరేష్ కు మధ్య విపరీతమైన గొడవ జరిగిన విషయం తెలిసిందే .

మా లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని సంచలన ఆరోపణలు చేసాడు నరేష్ , అయితే సినీ పెద్దల జోక్యంతో ఆ వివాదం ముగిసిపోయింది . కానీ మా అసోసియేషన్ కి మాయని మచ్చలా తయారయ్యింది . ఇక ఈ వివాదం వల్ల మహేష్ బాబు అమెరికా పర్యటన రద్దు అయ్యింది . పేద కళాకారుల కోసం పెద్ద ఎత్తున విరాళాలు సేకరించడానికి చిరంజీవి తో ఓ కార్యక్రమం నిర్వహించగా డబ్బు విషయంలో అది వివాదం అయ్యింది దాంతో మహేష్ బాబు అమెరికా కార్యక్రమం రద్దు చేసారు. దీనికి నరేష్ కారణం అని శివాజీరాజా నమ్ముతున్నాడు .

- Advertisement -

English Title: Sivajiraja revealed MAA controversy

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All