Homeటాప్ స్టోరీస్సీతారామం & బింబిసార ఫస్ట్ డే కలెక్షన్స్

సీతారామం & బింబిసార ఫస్ట్ డే కలెక్షన్స్

గత కొద్దీ రోజులుగా ప్రేక్షకులు లేక వెలవెల బోయిన థియేటర్స్ మళ్లీ కళాకలాడుతున్నాయి. నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సీతారామం & బింబిసార చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మ రథంపడుతున్నారు. సినిమా బాగుందంటే ప్రేక్షకులు థియేటర్స్ కు వస్తారని మరోసారి ఈ రెండు సినిమాలు రుజువు చేసాయి. కళ్యాణ్ రామ్ హీరో గా వశిష్ట డైరెక్టర్ గా తెరకెక్కిన బింబిసార చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో కళ్యాణ్ రామ్ సినీ కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా బింబిసార నిలిచింది.

- Advertisement -

మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.6.30 కోట్లు వసూలు చేయగా.. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం రూ.7.27 కోట్ల షేర్‌ కలెక్షన్లను రాబట్టింది. కళ్యాణ్ రామ్‌ కెరీర్‌లో ఫస్ట్‌డే అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన చిత్రంగా ‘బింబిసార’ నిలిచింది.

ఫస్ట్ డే ఏరియా వైజ్ కలెక్షన్స్ చూస్తే ..

నైజాం – రూ.2.15 కోట్లు

సీడెడ్ – రూ.1.29 కోట్లు

ఈస్ట్ – రూ.43 లక్షలు

వెస్ట్ – రూ.36 లక్షలు

ఉత్త‌రాంధ్ర – రూ.90 లక్షలు

గుంటూరు- రూ.54 లక్షలు

కృష్ణా – రూ. 34 లక్షలు

నెల్లూరు – రూ.26 క్షలు

కర్ణాటక, రెస్టాఫ్‌ ఇండియా- రూ.0.32 లక్షలు

ఓవర్సీస్‌ రూ.65లక్షలు

ప్రపంచ వ్యాప్తంగా మెత్తం రూ. 7.27 కోట్ల షేర్‌ (రూ.11.50 కోట్ల గ్రాస్‌) సాధించింది. ఇక ఈ చిత్రంతో పాటు సీతారామం అనే మూవీ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. హను రాఘవపూడి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ వారు నిర్మించారు.

ఈ చిత్ర ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే..

నైజాం – రూ. 54 ల‌క్ష‌లు

సీడెడ్ – రూ. 16 ల‌క్ష‌లు

ఉత్త‌రాంధ్ర – రూ. 23 ల‌క్ష‌లు

ఈస్ట్ – రూ. 15 ల‌క్ష‌లు

వెస్ట్ – రూ. 8 ల‌క్ష‌లు

గుంటూరు – రూ. 15 ల‌క్ష‌లు

కృష్ణ – రూ. 13 ల‌క్ష‌లు

నెల్లూరు – రూ. 5 ల‌క్ష‌లు

రెండు తెలుగు రాష్ట్రాల్లో సీతారామం సినిమాకు రూ. 2.25 కోట్లు గ్రాస్ క‌లెక్ష‌న్స్ రాగా.. రూ. 1.50 కోట్లు షేర్ రాబట్టింది. ఇక క‌ర్ణాట‌క‌, రెస్టాఫ్ ఇండియాలో రూ. 15 ల‌క్ష‌లు ఇత‌ర భాష‌ల్లో రూ. 35 ల‌క్ష‌లు.. ఓవ‌ర్ సీస్ రూ. 1.05 కోట్లు వ‌సూళ్లు వ‌చ్చాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా చూస్తే సీతారామం చిత్రానికి రూ. 3.05 కోట్లు వ‌సూళ్లు వ‌చ్చాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All