Homeటాప్ స్టోరీస్సితార లో ఈ టాలెంట్ కూడా ఉందా..?

సితార లో ఈ టాలెంట్ కూడా ఉందా..?

Sithara kuchipudi dance
Sithara kuchipudi dance

సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందనే సంగతి తెలిసిందే. 9 ఏళ్లకే స్టార్ డమ్ సంపాదించుకుంది సితార పాప. ఈమె వీడియోలు, డాన్సులకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. పైగా తన తండ్రి సినిమాలతో పాటు మిగిలిన వాళ్ల రీల్స్ కూడా చేసి ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తుంటుంది. రీసెంట్ గా సర్కారు వారి పాట సినిమాలోని కళావతి పాట స్టెప్ రీల్ చేసి ఆకట్టుకుంది.

ఈరోజు శ్రీరామ న‌వ‌మి పండుగ సంద‌ర్భంగా మహేష్ పోస్ట్ చేసిన ట్వీట్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది. ఇంత‌కీ మ‌హేష్ అంత హ్యాపీగా షేర్ చేసిన ట్వీట్ దేని గురించో తెలుసా! కుమార్తె సితార గురించి. సితార డాన్స్ వీడియో షేర్ చేసాడు. అదేంటి సితార చాలా సార్లు డాన్స్ వీడియోలు చూశాం క‌దా.. ఇంకా కొత్తేముంది? అనే ఆలోచ‌న కూడా రావ‌చ్చు. కానీ.. అస‌లు విష‌యం ఏంటంటే..సితార ఈసారి వెస్ట్ర‌న్ డాన్స్ చేయ‌లేదు. మ‌న భార‌తీయ నృత్యాల్లో ఒక‌టైన కూచిపూడి డాన్స్ చేసింది. శ్రీరామ న‌వ‌వి శుభాకాంక్ష‌లు చెబుతూ మ‌హేష్ స‌ద‌రు వీడియో షేర్ చేసాడు మహేష్.

- Advertisement -

‘సితార తొలి కూచిపూడి నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌. ప‌ర‌మ ప‌విత్ర‌మైన శ్రీరామ న‌వ‌మి రోజున ఈ అంద‌రితో ఈ వీడియోషేర్ చేసుకోవ‌డం హ్యాపీగా ఉంది. సీతూ పాప‌.. నీ ప‌ని పట్ల నువ్వు చూపించే శ్ర‌ద్ధ చూస్తే నాకెంతో ముచ్చ‌ట‌గా ఉంటుంది. నువ్వు న‌న్నింకా గ‌ర్వ‌ప‌డేలా చేస్తున్నావు. సితార‌కు డాన్స్‌లో శిక్ష‌ణ ఇచ్చిన అరుణ బిక్షు, మ‌హ‌తి బిక్షుల‌కు ధ‌న్య‌వాదాలు’’ అంటూ మహేష్ షేర్ చేసాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All