Homeటాప్ స్టోరీస్సీతా రామం కలెక్షన్స్

సీతా రామం కలెక్షన్స్

మహానటి ఫేమ్ దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘సీతా రామం’. మృనాల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో రష్మిక మందన్నా, సుమంత్, తరుణ్ భాస్కర్ కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో బడా ప్రొడ్యూసర్ సీ అశ్వనీదత్ నిర్మించారు. ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించారు. తెలుగు తో పాటు పలు భాషల్లో శుక్రవారం విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లోను ఈ మూవీ మంచి వసూళ్లు రాబడుతుంది.

- Advertisement -

ఏపీ, తెలంగాణలో 2 రోజుల్లో రూ. 3.58 కోట్లు రాబట్టిన ‘సీతా రామం’ మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 35 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.85 కోట్లు, మిగితా భాషల్లో రూ. 90 లక్షలు వసూలు చేసింది. వీటితో కలిపి రెండు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 6.68 కోట్లు షేర్‌‌తో పాటు రూ. 13.30 కోట్లు గ్రాస్‌ను సాధించింది. గత కొద్దీ రోజులుగా సరైన సినిమా లేక ప్రేక్షకులు థియేటర్స్ కు ప్రేక్షకులు రావడం మానేశారు. ఈ తరుణంలో సీతారామం తో పాటు బింబిసార మూవీస్ వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకొని మళ్లీ కళ తీసుకొచ్చాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All