Homeటాప్ స్టోరీస్పూరి రొమాంటిక్ లో సీనియర్ హీరోయిన్ అత్త!

పూరి రొమాంటిక్ లో సీనియర్ హీరోయిన్ అత్త!

పూరి రొమాంటిక్ లో సీనియర్ హీరోయిన్ అత్త!
పూరి రొమాంటిక్ లో సీనియర్ హీరోయిన్ అత్త!

పూరి జగన్నాథ్ తన కొడుకు ఆకాష్ పూరిని హీరోగా మెహబూబా సినిమాతో పరిచయం చేసిన విషయం తెల్సిందే. అయితే ఆ సినిమా అనుకున్నట్లుగా విజయం సాధించలేదు. దీంతో ఈసారి పూరి జగన్నాథ్ కేవలం నిర్మాతగా ఉండి తన శిష్యుడు అనిల్ పాదూరిని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమా రొమాంటిక్. ఈ సినిమా మెజారిటీ షూటింగ్ లాక్ డౌన్ కు ముందు పూర్తయింది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక కీలక అప్డేట్ తెలిసింది. ఈ చిత్రంలో ఆకాష్ పూరి అత్తగా సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ కనిపించనుందని సమాచారం. రొమాంటిక్ లో పాపులర్ హాట్ మోడల్ కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె తల్లిగా సిమ్రాన్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. కావాలనే రొమాంటిక్ టీమ్ ఈ విషయాన్ని రివీల్ చేయలేదు. రొమాంటిక్ లో రమ్య కృష్ణ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెల్సిందే.

- Advertisement -

వచ్చే నెల నుండి ఈ సినిమా షూటింగ్ తిరిగి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. మాఫియా నేపథ్యంలో సాగే ఒక హృద్యమైన ప్రేమకథగా రొమాంటిక్ గురించి చెబుతున్నారు టీమ్. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే రివీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All