Homeటాప్ స్టోరీస్సిద్దార్థ్ విలన్ గా ఒప్పుకున్నట్లేనా

సిద్దార్థ్ విలన్ గా ఒప్పుకున్నట్లేనా

Siddharth may be the villain in Nani movieవిక్రమ్ కుమార్ సినిమాలో నాని నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కాగా ఆ చిత్రంలో కీలక పాత్రలో విలన్ గా నటించడానికి హీరో సిద్దార్థ్ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది . హీరోగా సిద్దార్థ్ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నాడు . ఈ హీరోకు తమిళనాట మాత్రమే కాకుండా టాలీవుడ్ లో కూడా అభిమానులు ఉన్నారు అయితే గతకొంత కాలంగా హీరోగా సక్సెస్ లు అందుకోలేక పోతున్నాడు సిద్దార్థ్ . దాంతో అతడ్ని నాని సినిమాలో విలన్ గా నటించమని విక్రమ్ కుమార్ కోరినట్లు అందుకు సిద్దార్థ్ అంగీకరించినట్లు చెబుతున్నారు . అయితే సిద్దార్థ్ విలన్ గా నటిస్తాడా ? అన్న అనుమానం కూడా నెలకొంది .

విభిన్న కథా చిత్రాలు చేస్తున్న నాని కి వరుసగా రెండు సినిమాలు పెద్ద దెబ్బ కొట్టాయి దాంతో విక్రమ్ కుమార్ సినిమా ఓకే చేసినట్లు తెలుస్తోంది . ఇప్పటికే జెర్సీ అనే సినిమా చేస్తున్నాడు నాని , దాన్ని కంప్లీట్ చేసాక విక్రమ్ కుమార్ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందట . థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్క నున్న విక్రమ్ సినిమాపై నాని ఆశలు పెట్టుకున్నాడు . ఇక నాని – సిద్దార్థ్ ఇద్దరు కూడా మంచి స్నేహితులు కట్ చేస్తే తెరమీద మాత్రం బద్ద శత్రువులుగా నటించడానికి సిద్ధం అవుతున్నారట .

- Advertisement -

English Title: Siddharth may be the villain in Nani movie

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All