
బొమ్మరిల్లు ఫేమ్ సిద్దార్థ్..ప్రస్తుతం వరుస సినిమాల ఫై ఫోకస్ పెడుతున్నాడు. ఈ మధ్యనే తెలుగులో శర్వానంద్ తో కలిసి మహాసముద్రం మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమా భారీ ప్లాప్ అందుకుంది. ఇక ఇప్పుడు ఇటకీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ తాజాగా నిర్మిస్తున్న త్రిభాషా చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. గతంలో ఈ సంస్థ నుండి కాదల్ సొదప్పువదు ఎప్పడీ, జిల్ జంగ్ జక్, అవళ్ వంటి విజయవంతమైన చిత్రాలు రాగా..ఇప్పుడు నాల్గొవ సినిమాగా ఇది రాబోతుంది.
ఎస్‌యూ అరుణ్ కుమార్ ఈ చిత్రానికి డైరెక్షన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి టైటిల్ ఫిక్స్ చేయలేదు. అయినప్పటికీ సిద్దార్థ్ పుట్టిన రోజు సందర్బంగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్లు విడుదల చేశారు. తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ అద్భుతమైన క్లాసికల్ కథ కుదిరిందని, చిత్రం షూటింగ్ తమిళనాడులోని పళనిలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు.