Homeటాప్ స్టోరీస్చీ సిగరెట్ తాగుతావా అంటే మందు కూడా తాగుతోంది

చీ సిగరెట్ తాగుతావా అంటే మందు కూడా తాగుతోంది

shweta salve shares drink and smoke photosచీ సిగరెట్ తాగుతావా ? సిగరెట్ తాగే నువ్వు నీ పిల్లలకు ఏం నేర్పిస్తావ్ ? నువ్వెలా మంచి తల్లి వి అవుతావ్ ? అంటూ నటి , మోడల్ శ్వేతా సాల్వే ని నెటిజన్ లు ప్రశించడంతో చిర్రెత్తు కొచ్చిన ఈ హాట్ భామ ఏకంగా మందు తాగుతున్న ఫోటో ని పెట్టి నెటిజన్ లను మరింతగా రెచ్చగొడుతోంది . సిగరెట్ తాగితే తప్పా ? సిగరెట్ తాగితే మంచి తల్లి కాదా ? అయితే చూడండి అంటూ మద్యం తాగుతూ ఫోటోలు దిగి వాటిని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది శ్వేతా సాల్వే . అసలే టు పీస్ బికినీ వేసి సిగరెట్ తాగుతున్న ఫోటోలు అప్ లోడ్ చేయడంతో విమర్శలు రాగా , ఆ విమర్శలకు కోపం వచ్చిన ఈ భామ బికినీ లో మద్యం తాగుతూ ఫోటోలకు ఫోజిచ్చి మరింత షాక్ ఇచ్చింది .

33 ఏళ్ల శ్వేతా సాల్వే గత ఏడాది ఘాటు లిప్ లాక్ లతో సోషల్ మీడియాలో కాకరేపింది . తాజాగా బికినిలో సిగరెట్ తాగుతూ , మద్యం తాగుతూ మరింతగా విమర్శించేవాళ్ళ ని ఇంకా ఉడికిపోయేలా చేసింది . సిగరెట్ తాగినా , మద్యం తాగినా మనసు మంచిదై ఉండాలి అంతేకాని తాగుతున్న వాళ్ళంతా చెడ్డవాళ్ళు అని మీరెలా డిసైడ్ చేస్తారు ? అంటూ ప్రశ్నిస్తోంది కూడా . సిగరెట్ , మద్యం తాగినంత మాత్రాన నా క్యారెక్టర్ బ్యాడ్ కాదని , అది వేరే వాళ్ళు డిసైడ్ చేసేది కాదని చురకలు అంటిస్తోంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All