Homeటాప్ స్టోరీస్శుభలేఖ+లు రివ్యూ

శుభలేఖ+లు రివ్యూ

shubhalekha+lu movie review
శుభలేఖ+లు రివ్యూ

శుభలేఖ+లు రివ్యూ :
నటీనటులు : సాయి శ్రీనివాస్ , దీక్షా , ప్రియా వడ్లమాని , వంశీ ,మోనా
సంగీతం : కే ఎం రాధాకృష్ణ
నిర్మాతలు : సి. విద్యాసాగర్ ,ఆర్ ఆర్ జనార్దన్
దర్శకత్వం : శరత్ నర్వాడే
రేటింగ్ : 3/ 5
రిలీజ్ డేట్ : 7 డిసెంబర్ 2018

సాయి శ్రీనివాస్ , దీక్షా శర్మ , ప్రియా వడ్లమాని , వంశీ నెక్కంటి , మోనా బెద్రే , అప్పాజీ తదితర తారాగణం నటించిన చిత్రం శుభలేఖ+లు . శరత్ నర్వాడే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిమ్స్ బ్యానర్ పై విడుదల చేసారు . మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .

కథ :

- Advertisement -

చందు (సాయి శ్రీనివాస్ ) తన మరదలైన శిరీష్ ( దీక్షా శర్మ ) ని ప్రేమిస్తుంటాడు . చందు తన టాలెంట్ ని నిరూపించుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటాడు కానీ ఇంట్లో వాళ్ళకేమో వీడు పని పాట లేకుండా ఆవారాగా తిరుగుతున్నాడని అనిపిస్తుంటుంది . తన సవతి తల్లి కూతురైన నిత్యా ( ప్రియా వడ్లమాని ) కు పెళ్లి కుదురుతుంది . దాంతో చెల్లి పెళ్లిని బాగా చేయాలనీ అనుకుంటాడు చందు కానీ నిత్యా మరొకరిని ప్రేమిస్తోందని ,అతడితో లేచిపోయి పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోందని తెలిసుకొని షాక్ అవుతాడు చందు . చెల్లి లేచిపోయి పెళ్లి చేసుకుంటే అది కుటుంబ పరువుకు సంబందించిన సమస్య కాబట్టి చందు ఆ సమస్య ని ఎలా హ్యాండిల్ చేసాడు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

కాన్సెప్ట్
విజువల్స్
సాయి శ్రీనివాస్
దీక్ష శర్మ
ప్రియా వడ్లమాని

డ్రా బ్యాక్స్ :

స్లో నెరేషన్

నటీనటులు :

చందు పాత్రలో సాయి శ్రీనివాస్ చాలా బాగా చేసాడు . తన ఫిజిక్ తో ఆకట్టుకోవడమే కాకుండా కీలక సన్నివేశాల్లో సైతం ఎంతో అనుభవమున్న నటుడిలా చేసాడు . హీరోయిన్ లు దీక్షా శర్మ , ప్రియా వడ్లమాని ఇద్దరు కూడా బాగా నటించారు అలాగే గ్లామర్ తో అలరించారు . రొమాంటిక్ సీన్స్ లో మరింతగా మెప్పించారు . ఇక మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమతమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు .

సాంకేతిక వర్గం :

కే ఎం రాధాకృష్ణ అందించిన సంగీతం బాగుంది , నిర్మాణ విలువలు బాగున్నాయి . విజువల్స్ చాలా బాగున్నాయి . ఇక దర్శకుడు శరత్ విషయానికి వస్తే మంచి కాన్సెప్ట్ ని ఎంచుకున్నాడు . అయితే దాన్ని హండ్రెడ్ పర్సెంట్ స్క్రీన్ మీద తీసుకురావడంలో కాస్త తడబడ్డాడు . అయితే మొదటి ప్రయత్నమే మంచి అటెంప్ట్ చేసాడు .

ఓవరాల్ గా :

యువత కోసమే కాదు కుటుంబ విలువల కోసం తప్పకుండా చూడాల్సిన సినిమా శుభలేఖ+ లు .

English Title: shubhalekha+lu movie review

Click here for English Review

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All