Homeటాప్ స్టోరీస్టాటూస్ ఎక్క‌డెక్క‌డున్నాయో చెప్పేసింది!

టాటూస్ ఎక్క‌డెక్క‌డున్నాయో చెప్పేసింది!

టాటూస్ ఎక్క‌డెక్క‌డున్నాయో చెప్పేసింది!
టాటూస్ ఎక్క‌డెక్క‌డున్నాయో చెప్పేసింది!

హీరోయిన్‌ల‌కి టాటూస్ వేయించుకోవ‌డం ఓ ఫ్యాష‌న్‌గా మారిపోయింది. వాటిని స్పెష‌ల్ సింబ‌ల్స్‌గా చూసుకుంటున్న వారు కూడా వున్నారు. కొంత మంది యెద‌పై భాగంలో వేయించుకుంటే మ‌రి కొంత మంది త‌మ‌కు బాగా న‌చ్చిన ప్లేస్‌లో టాటూస్ వేయించుకుని మురిసి పోతుంటారు. త్రిష త‌న ఎద పైభాగంలో టాటూ వేయించుకుంటే న‌య‌న‌తార లెఫ్ట్ హ్యాండ్ పై తాప్సీ లెఫ్ట్ లెగ్ అండ్ లెఫ్ట్ షోల్డ‌ర్‌పై టాటూ వేయించుకుంది.

వీరంద‌రి త‌ర‌హాలో శృతిహాస‌న్ కూడా త‌న‌కు న‌చ్చిన ప్లేస్‌ల‌లో టాటూలు వేయించుకుంది. రీసెంట్‌గా అవి ఎక్క‌డెక్క‌డున్నాయో చెప్పేసింది. మెడ భాగంలో మ్యూజిక్ సింబ‌ల్‌ని, వెన‌క భాగంలో త‌న పేరుని,  లెఫ్ట్ హ్యాండ్ మణికట్టు భాగంలో గులాబీ పువ్వు సింబ‌ల్‌, మరియు పాదాల మీద పచ్చబొట్లు ఉంచడాన్ని శ్రుతి హాసన్ వెల్లడించారు. టీనేజ్ ద‌శ నుంచే శృతికి టాటూల ప‌ట్ల ఇష్టం ఏర్ప‌డింద‌ట. ఆ కార‌ణంగానే ఒంటిపై  మొత్తం ఐదు టాటూలు వేయించుకుంద‌ట‌.

- Advertisement -

ప‌వ‌‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ తో క‌లిసి న‌టించిన `కాట‌మ రాయుడు` త‌రువాత‌ శృతిహాస‌న్ తెలుగులో మ‌రో సినిమా చేయ‌లేదు. కొంత విరామం త‌రువాత ఆమె న‌టిస్తున్న తెలుగు చిత్రం `క్రాక్‌`. మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా న‌టిస్తున్నారు. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మ‌ధు నిర్మిస్తున్నారు. క‌రోనా కార‌ణంగా మేలో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం విడుద‌ల వాయిదాప‌డింది. త్వ‌ర‌లో ట‌ర్మ్స్ కుదిరితే ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ కానుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All