
మెగాస్టార్ చిరంజీవి – బాబీ కలయికలో చిరు 154 మూవీ తెరకెక్కుతుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ లో చిరంజీవి కి జోడిగా శృతి హాసన్ నటిస్తుంది. అలాగే ఓ కీలక పాత్రలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్నాడు.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా..తాజాగా ఈ మూవీ సెట్ లో శృతి హాసన్ చేరింది. ఇక క్రాక్ , వకీల్ సాబ్ మూవీస్ తో హిట్స్ అందుకున్న శృతి.. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సలార్’లో హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే, తనకు ‘క్రాక్’ మూవీతో సాలిడ్ హిట్ ఇచ్చిన దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య హీరోగా తెరకెక్కుతున్న మూవీ లో నటిస్తుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాల షూటింగ్‌లో శృతి హాసన్ నటిస్తుంది.