Homeటాప్ స్టోరీస్లవర్ కు దూరంగా ఉన్నందుకు బాధపడుతోంది

లవర్ కు దూరంగా ఉన్నందుకు బాధపడుతోంది

shruti haasan birth day wishes to loverఅసలే ప్రేమికుడి పుట్టినరోజు దాంతో ఒకింత సంతోషం కాగా మరోవైపు బాధతో సతమతం అవుతోంది అందాల భామ శృతి హాసన్ . ఈ భామ మైఖేల్ కోర్సెల్ ని ప్రేమిస్తున్న విషయం తెలిసిందే . అయితే మైఖేల్ పుట్టినరోజు సందర్బంగా అతడు ఒకచోట శృతి మరో చోట ఉన్నారు దాంతో అతడికి ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తూ మైఖేల్ కు తన జీవితంలో ఎంతటి ప్రాధాన్యత ఉందో చెబుతోంది .

”పుట్టినరోజు సమయంలో నేను నీ దగ్గర లేకపోవడం బాధగా ఉంది అని అంటూనే నా ప్రతీ సందర్భంలో నన్ను నవ్విస్తూ , నవ్వుతు ఉండే ఫన్నీ గై హ్యాపీ బర్త్ డే మై బెస్ట్ ఫ్రెండ్ ” అంటూ ట్వీట్ చేసింది శృతి హాసన్ . గతకొంత కాలంగా సినిమాలు పక్కన పెట్టి ప్రియుడి తోనే ఎంజాయ్ చేస్తోంది ఈ భామ . ఆమధ్య ఈ ఇద్దరికీ పెళ్లి కూడా అయ్యిందని పుకార్లు చెలరేగాయి అయితే పెళ్లి ఇప్పట్లో కాదని తేల్చి చెప్పింది లే ఈ భామ .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All