Homeటాప్ స్టోరీస్విజయశాంతి అంత డిమాండ్ చేసిందా ?

విజయశాంతి అంత డిమాండ్ చేసిందా ?

లేడీ అమితాబ్ విజయశాంతి ఒకప్పుడు స్టార్ హీరోయిన్ , స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని రెమ్యునరేషన్ తీసుకుంటూ తిరుగులేని ఇమేజ్ ని సొంతం చేసుకుంది . కట్ చేస్తే సినిమాలకు దూరమై 15 ఏళ్ళు కావస్తోంది . మళ్ళీ ఇన్నాళ్లకు మహేష్ బాబు పుణ్యమా అని ముఖానికి రంగేసుకొని కెమెరా ముందుకు రానుంది . మహేష్ బాబు – అనిల్ రావిపూడి సినిమా కోసం విజయశాంతి ని తీసుకున్నారు . అయితే ఈ సినిమా కోసం ఏకంగా 2 కోట్లు డిమాండ్ చేసిందట .

- Advertisement -

అయితే అంత మొత్తం విని మొదట భయపడినప్పటికీ , విజయశాంతి కున్న క్రేజ్ కి ఆ మొత్తం ఇవ్వడం పెద్ద కష్టమేమి కాదని అనుకున్నారట అయితే కొద్దిగా బేరమాడి కోటిన్నర కు తెగ్గొట్టారని తెలుస్తోంది . వరుస విజయాలు సాధిస్తున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో విజయశాంతి కూడా సంతోషంగా ఒప్పుకుందట . మహేష్ బాబు కు తల్లిగా కొడుకు దిద్దిన కాపురం చిత్రంలో నటించింది విజయశాంతి కట్ చేస్తే 30 ఏళ్ల తర్వాత మళ్ళీ మహేష్ బాబు – విజయశాంతి కలిసి నటిస్తున్న చిత్రం కావడం విశేషం .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All