Homeన్యూస్కరుణడ చక్రవర్తి డా శివరాజ్ కుమార్ పాన్ ఇండియా హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ 'ఘోస్ట్'...

కరుణడ చక్రవర్తి డా శివరాజ్ కుమార్ పాన్ ఇండియా హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఘోస్ట్’ నుండి బ్లాస్టింగ్ ‘బిగ్ డాడీ’ టీజర్ విడుదల

కరుణడ చక్రవర్తి డా శివరాజ్ కుమార్ పాన్ ఇండియా హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ 'ఘోస్ట్' నుండి బ్లాస్టింగ్ 'బిగ్ డాడీ' టీజర్ విడుదల
కరుణడ చక్రవర్తి డా శివరాజ్ కుమార్ పాన్ ఇండియా హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఘోస్ట్’ నుండి బ్లాస్టింగ్ ‘బిగ్ డాడీ’ టీజర్ విడుదల

కరుణడ చక్రవర్తి డా శివరాజ్ కుమార్ తన తాజా చిత్రం, హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ఘోస్ట్ తో ప్యాన్ ఇండియా బరిలో దిగనున్నారు. కన్నడ బీర్బల్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు రూపొందించి తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న దర్శకుడు శ్రీని ఘోస్ట్ చిత్రానికి దర్శకుడు. ప్రముఖ రాజకీయనాయకుడు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఘోస్ట్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతి ప్రచార చిత్రం అంచనాలు పెంచే విధంగానే ఉండటం సినిమా ఏ స్థాయిలో తెరకెక్కిందో తెలియజేస్తోంది. మేకర్స్ ఘోస్ట్ నుండి బిగ్ డాడీ టీజర్ ను డా. శివరాజ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని జూలై 12 న విడుదల చేశారు.

టీజర్ ఒక పాడుబడిన బిల్డింగ్ ను ఆయుధాలు ధరించిన కొందరు వ్యక్తులు చుట్టుముట్టడంతో తో మొదలవుతుంది. వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవారు ఆ బిల్డింగ్ లో ఉన్నతను ప్రాణాలతో కావాలని, అతనితో చాలా జాగ్రత్త గా ఉండాలని హెచ్చరికలు చేస్తుంటాడు. శివరాజ్ కుమార్ బిల్డింగ్ లో కూర్చుని పాని పూరి స్టైల్ లో ఆల్కహాల్ పూరి తింటూ వీరి కోసం ఎదురు చూస్తుంటాడు. ఆయుధాలతో చుట్టు ముట్టి కదిలితే కాల్చేస్తాం అని వార్నింగ్ ఇవ్వగానే, శివరాజ్ కుమార్ తన చేతిలోని మందు గ్లాస్ వెనుకనున్న కవర్ మీద వేసి సిగరెట్ ను విసిరేస్తాడు. వెంటనే మరో సిగరెట్ వెలిగించే లోగా వెనకనున్న కవర్ కాలిపోయి బిగ్ డాడీ రివీల్ అవుతుంది. అది ఒక భారీ యుద్ధ టాంకర్. అది చూశాక శివరాజ్ కుమార్ ను పట్టుకోడానికి వచ్చిన వారికి నోట మాట రాదు. చివరగా, ” మీరు గన్ను తో ఎంత మందిని భయపెట్టారో అంతకంటే ఎక్కువ మందిని నేను నా కళ్ళతో భయపెట్టాను. దే కాల్ మీ ఓ జీ… ఒరిజినల్ గ్యాంగ్ స్టర్” అనే పవర్ఫుల్ డైలాగ్ తో ముగుస్తుంది.

- Advertisement -

శివన్న తన టెర్రిఫిక్ స్క్రీన్ ప్రెజెన్స్ తో సూపర్ స్వాగ్ తో ఆకట్టుకున్నారు. అర్జున్ జన్య అందించిన పవర్ఫుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, యాక్షన్ ఫిల్మ్ కి తగ్గ లైటింగ్ మూడ్ ను అందించిన సినిమాటోగ్రాఫర్ మహేష్ సింహా పనితనం ఆకట్టుకుంటుంది. బిగ్ డాడీ గా ఏకంగా వార్ టాంకర్ నే తెచ్చిన దర్శకుడు శ్రీని విజన్ ను మెచ్చుకోకుండా ఉండలేం. తను ఘోస్ట్ ను ఎంత భారీ స్థాయిలో రూపొందిస్తున్నాడో ఈ టీజర్ చూస్తే అర్థమైపోతుంది. నిర్మాత సందేశ్ నాగరాజ్ అత్యంత భారీ వ్యయంతో ఘోస్ట్ ను టెక్నికల్ గా టాప్ లెవెల్ లో నిర్మిస్తున్నారు.

ప్రముఖ నటులు అనుపమ్ ఖేర్, జయరామ్, ప్రశాంత్ నారాయణ్, అర్చన జాయిస్, సత్య ప్రకాష్, దత్తన్న ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. ‘ఘోస్ట్’ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. మస్తీ, ప్రసన్న వి ఎం డైలాగ్స్ రాస్తున్నారు. మోహన్ బి కేరే ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. తెలుగు వెర్షన్ పి ఆర్ ఓ గా బి ఏ రాజు’s టీమ్ పని చేస్తుండగా, పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య సంగీతాన్ని అందిస్తున్నారు. కన్నడ లో టాప్ స్టార్స్, టెక్నీషియన్స్ తో చిత్రాలు తీసే సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత సందేశ్ నాగరాజ్ ‘ఘోస్ట్’ ని లావిష్ స్కేల్ లో ప్రొడ్యూస్ చేస్తున్నారు. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో ఘోస్ట్ దసరా కు ప్రేక్షకుల ముందుకి రానుంది.

క్యాస్ట్, టెక్నికల్ టీం:
డాక్టర్ శివరాజ్ కుమార్, అనుపమ్ ఖేర్, జయరామ్, ప్రశాంత్ నారాయన్, అర్చనా జాయిస్, సత్య ప్రకాష్, దత్తన్న మరియు తదితరులు
ప్రొడక్షన్ హౌస్: సందేశ్ ప్రొడక్షన్స్ (31 వ చిత్రం)
సమర్పణ: సందేశ్ నాగరాజ్ (ఎమ్మెల్సీ)
నిర్మాత: సందేశ్ ఎన్.
కథా, దర్శకత్వం: శ్రీని
సంగీతం: అర్జున్ జన్య
సినిమాటోగ్రఫీ: మహేంద్ర సింహ
యాక్షన్ కొరియోగ్రఫీ: చేతన్ డిసౌజా, వెంకట్ (హైదరాబాద్), అర్జున్ రాజ్, మాస్ మద
ఎడిటింగ్: దీపు ఎస్ కుమార్
ప్రొడక్షన్ డిజైన్: మోహన్ బి కేరే బి
వి ఎఫ్ ఎక్స్ సూపర్ విజన్: మహమ్మద్ అబ్ది
వి ఎఫ్ ఎక్స్: అసు స్టూడియోస్ (టెహ్రాన్)
కలరిస్ట్: అమీర్ వలిఖని
డి ఐ స్టూడియో: ఫ్యూచర్ ఏజ్ స్టూడియో
సౌండ్ ఎఫెక్ట్స్: రాజన్
డిటిఎస్ ఫైనల్ మిక్సింగ్: మంజరి స్టూడియోస్
కో డైరెక్టర్స్: అమోఘవర్ష, ప్రసన్న వి.ఎం
డైరెక్షన్ టీం: కిరణ్ జిమ్కాల్, శ్రీనివాస్ హెచ్ వి, మంజు హెచ్ జి
డ్రోన్ కెమెరా: రాజ్ మోహన్
కెమెరా టీం: మను ప్రసాద్, సురేష్, నివాస్
అసోసియేట్ ఎడిటర్: మహేష్
ఆన్ లైన్ ఎడిటింగ్: చరణ్
అడిషనల్ బిజిఎం ఇన్ పుట్స్: అగస్త్య రాగ్
కాస్ట్యూమ్స్: శాంతారాం, భరత్, సాగర్ (శివరాజ్ కుమార్)
మేకప్: చిదానంద్ (ప్రోస్తేటిక్స్) హోన్నె గౌడ్రు
మేనేజర్: సురేష్ కె మైసూర్
అసిస్టెంట్ మేనేజర్స్: రాకేష్ రావు కార్తీక్ ఎన్ కె
క్యాషియర్: ప్రసాద్ బి ఎన్
పబ్లిసిటీ డిజైన్: కాని స్టూడియోస్
పి ఆర్ ఓ: వెంకటేష్, బి ఏ రాజు & టీమ్
డిజిటల్ పి ఆర్ ఓ: సెబాటిన, సతీష్
ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్: అర్చనా దినేష్
మార్కెటింగ్: శృతి ఐఎల్, సంతోష్ నందకుమార్, నిషా కుమార్, రాఘవన్ లక్ష్మణ్,
డిజిటల్ మార్కెటింగ్: ఎస్ ఐ ఎల్ స్టూడియోస్

బిగ్ డాడీ టీజర్ మ్యూజిక్ క్రెడిట్స్:
మ్యూజిక్ ప్రోగ్రామింగ్: అర్జున్ జన్య, రూపేష్, నిషాన్
సాజ్ లైవ్: డేవిడ్ సెల్వం
మిక్సింగ్ అండ్ మాస్టర్డ్: డేవిడ్ సెల్వం

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All