Homeటాప్ స్టోరీస్శివ కందుకూరి లుక్ మామూలుగా లేదుగా!

శివ కందుకూరి లుక్ మామూలుగా లేదుగా!

శివ కందుకూరి లుక్ మామూలుగా లేదుగా!
శివ కందుకూరి లుక్ మామూలుగా లేదుగా!

`పెళ్లి చూపులు` ఫేమ్ రాజ్ కందుకూరి త‌న‌యుడు శివ కందుకూరి విల‌క్ష‌ణమైన చిత్రాల్లో న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఐదు భాష‌ల్లో విడుద‌ల కానున్న `గ‌మ‌నం`తో పాటు య‌ద‌ర్ధ సంఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందుతున్న `చేత‌క్ శీను`లోనూ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా మ‌రో విల‌క్ష‌ణ చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. `మ‌ను చ‌రిత్ర‌` పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా భ‌ర‌త్ పెద‌గాని ద‌ర్శ‌‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.

మేఘా ఆకాష్, ప్రియ వ‌డ్ల‌మాని హీరోయిన్‌లుగా న‌టిస్తున్న ఈ మూవీ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. స్టార్ హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కురాలిగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఎన్. శ్రీ‌నివాస‌రెడ్డి, రాన్‌స‌న్ జోసెఫ్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. హీరో శివ కందుకూరి పుట్టిన రోజు నేడు ఈ సంద‌ర్భంగా చిత్ర బృందం ఈ మూవీకి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేసింది.

- Advertisement -

పోస్ట‌ర్‌లో ర‌గ్గ్‌డ్ లుక్‌లో శివ క‌నిపిస్తున్నాడు. ప‌ల్స‌ర్‌పై గుబురు జుట్టు… మాసిన గ‌డ్డం… నోట్లో వెలుగుతున్న సిగ‌రేట్‌.., రైట్ హ్యాండ్‌లో రోజ్ ఫ్ల‌వ‌ర్‌… ఒళ్లంతా గాయాల‌తో బ్ల‌డ్ కారుతోంది. ల‌వ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా వ‌రంగ‌ల్ నేప‌థ్యంలో ఈ మూవీ తెర‌కెక్క‌బోతోంది. గోపీ సుంద‌ర్ సంగీతం అందిస్తుండ‌గా, రాహుల్ శ్రీ‌వాత్స‌వ ఛాయాగ్ర‌హ‌ణం అందిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All