Homeటాప్ స్టోరీస్లవర్ తల్లి తో ప్రేమ – సిమ్లా మిర్చి మూవీ

లవర్ తల్లి తో ప్రేమ – సిమ్లా మిర్చి మూవీ

లవర్ తల్లి తో ప్రేమ – సిమ్లా మిర్చి మూవీ
లవర్ తల్లి తో ప్రేమ – సిమ్లా మిర్చి మూవీ

అసలు బాలీవుడ్ కి ఏమైంది.? బోల్డ్ పేరుతో, డార్క్ కామెడీ అని కొందరూ, బ్లాక్ కామెడీ అని కొందరూ, అడల్ట్ కంటెంట్ ని ఒక స్లో పాయిజన్ లాగా ఎక్కిస్తున్నారు. ఈ ట్రెండ్ అనేది రీసెంట్ గా రిలీజ్ అయిన “గుడ్ న్యూజ్” సినిమాతో వావి వరుసలు లేని వల్గర్ రిలేషన్స్ ని సినిమాలో చూపిస్తున్నారు. గతంలో కొన్ని ఏళ్ళ క్రితం పశ్చిమ దేశాలలో ఇలా, ఇన్సెస్ట్ రిలేషన్ షిప్స్ మీద పుస్తకాలు, కథలు సినిమాలు వచ్చేవి. ఇక షేక్ స్పియర్ లాంటి రచయిత సైతం ఆయన నాటకాల్లో ఇన్సెస్ట్ రిలేషన్స్ గురించి డిస్కస్ చేసారు. అప్పుడు ఆయనను వింతగా, చూసారు అప్పటి జనం. కాని ఒక వంద సంవత్సరాల తరువాత ప్రజల్లో అనేక రకాల కారణాల వల్ల విచ్చలవిడితనం, విశృంఖలత్వం పెరిగిపోయాయి.

అసలు ఈ బాధంతా ఎందుకంటే, బాలీవుడ్ లో జనవరి 3న “సిమ్లా మిర్చి” అని ఒక సినిమా వస్తోంది. అందులో మెయిన్ క్యారెక్టర్స్ గా డ్రీం గర్ల్ హేమ మాలిని గారు, రకుల్ ప్రీత్ సింగ్ తల్లీ – కూతుర్లుగా నటిస్తున్నారు. ఇక హీరోగా విలక్షణ నటుడు రాజ్ కుమార్ రావు నటిస్తున్నాడు. ఇక కథ ప్రకారం నత్తి ఉన్న హీరో హీరోయిన్ కి డైరెక్ట్ గా ప్రపోజ్ చెయ్యలేక, లవ్ లెటర్ రాస్తాడు. అది కాస్తా, ఒంటరితనంతో బాధపడుతున్న హీరోయిన్ తల్లి కనెక్ట్ అవుతుంది. ఆ తర్వాత జరిగే గజిబిజి గందరగోళం అంతా, తెరపై చూడవలసిందే.

- Advertisement -

అసలు ఒక సినిమా అభిమానిగా, నా ఆవేదన ఏంటంటే, హేమ మాలిని వంటి నటి ఇల్లాంటి ఒక బీ గ్రేడ్ సబ్జెక్ట్ చెయ్యడానికి ఎందుకు ఒప్పుకుందా.? అనే. లేదంటే ఈ సినిమాలో ట్రైలర్ చూస్తే, డెప్త్ ఫిలాసఫీ ఉన్నట్లు కూడా అనిపించడం లేదు. ఏంటో.? ఈ విష సంస్కృతి ఇంకా ఎంత దూరం వెళ్తుందో.?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All