Homeటాప్ స్టోరీస్థియేట్రిక‌ల్ స్టార్స్ అనే సిస్ట‌మ్ పోయింది!

థియేట్రిక‌ల్ స్టార్స్ అనే సిస్ట‌మ్ పోయింది!

థియేట్రిక‌ల్ స్టార్స్ అనే సిస్ట‌మ్ పోయింది!
థియేట్రిక‌ల్ స్టార్స్ అనే సిస్ట‌మ్ పోయింది!

థియేట‌ర్ వ్య‌వ‌స్థ‌పై బాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌పూర్ సోష‌ల్ మీడియా వేదిక‌గా సంచ‌ల‌న వ్యాఖ్‌య‌లు చేశారు. క‌రోనా కార‌ణంగా అన్ని రంగాల కంటే సినీ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. థియేట‌ర్స్ మూసి వేయ‌డంతో వంద‌ల కొద్ది చిత్రాలు రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాయి. కొంత‌మంది థియేట‌ర్‌లోనే రిలీజ్ చేస్తామ‌ని భీష్మించుకు కూర్చుంటున్నారు. కొంత మంది మాత్రం ఓటీటీలో రిలీజ్ చేస్తూ రిలీఫ్ అయిపోతున్నారు.

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో మార్పులు రావాలంటే డిసెంబ‌ర్ వ‌ర‌కు స‌మ‌యం ప‌ట్టేలా వుంది. ఈ నేప‌థ్యంలో సినీ రంగం ఓటీటీ బాట ప‌ట్టాల్సిందేన‌ని శేఖ‌ర్ క‌పూర్ ప‌రోక్షంగా వెల్ల‌డించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. వ‌చ్చే ఏడాది ప్రారంభం వ‌ర‌కు థియేట‌ర్లు తెరిచే ప‌రిస్థితి లేద‌ని, స్టార్స్ సినిమాలు కూడా ఓటీటీ బాట ప‌ట్టాల్సిందేన‌ని స్పష్టం చేశారు. ఏడాది వ‌ర‌కు థియేట‌ర్లు తెరిచే ప‌రిస్థితులు క‌నుచూపు మేర‌ల్లో క‌నిపించ‌డం లేదు. దీంతో గ‌త కొంత కాలంగా తొలి వారం మా సినిమా వంద కోట్లు కొల్ల‌గొడుతుంద‌నే లెక్క‌లు డెడ్ అయిన‌ట్టే. అంటే థియేట‌ర్స్ స్టార్స్ అనే సిస్టమ్ చ‌చ్చిపోయిన‌ట్టే` అన్న‌రు శేఖ‌ర్ క‌పూర్.

- Advertisement -

రామ్‌గోపాల్ వ‌ర్మ ఇటీవల సొంతంగా ఆర్జీవీ వ‌ర‌ల్డ్ థియేట‌ర్ పేరుతో శ్రేయాస్ ఈటీతో క‌లిసి ఓటీటీని ప్రారంభించిన విష‌యం తెలిసిందే. దీన్ని ఉద్దేశించిన శేఖ‌ర్ క‌పూర్ తాజాగా థియేట‌ర్ సిస్ట‌మ్‌, స్టార్స్ యెర గురించి ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All