Homeఎక్స్ క్లూసివ్సినిమా ప్లాప్ అని హీరోనే ఒప్పుకుంటున్నాడు

సినిమా ప్లాప్ అని హీరోనే ఒప్పుకుంటున్నాడు

Sharwanand and Varun tej talk about failure movies
Varun tej and Sharwanand

మా సినిమా ప్లాప్ అని స్వయంగా హీరోలు ఒప్పుకుంటున్నారు అందునా సక్సెస్ మీట్ అని పెట్టి మరీ . ఇటీవల కాలంలో ఇలాంటి ధోరణి ఎక్కువయ్యింది . ఒకప్పడు సినిమా బాగోలేకపోయినా మా సినిమా సూపర్ ….. బంపర్ అంటూ చెప్పుకునే వాళ్ళు కాకపోతే ఆ ధోరణి మారి మా సినిమా ఆశించిన స్థాయిలో ఆడటం లేదు కానీ ఆదరిస్తున్నారు అంటూ ముక్తాయింపు ఇస్తున్నారు పలువురు హీరోలు . మొన్నటికి మొన్న హీరో వరుణ్ తేజ్ అంతరిక్షం గురించి ప్రెస్ మీట్ లో  ఓపెన్ అయిపోగా నిన్నటికి నిన్న శర్వానంద్ కూడా పడిపడి లేచె మనసు గురించి ఒప్పేసుకున్నాడు .

పడిపడి లేచె మనసు క్రిటిక్స్ కి నచ్చలేదు , వారి వారి అభిప్రాయం వాళ్ళు చెప్పారు కానీ నా కెరీర్ లోనే బెస్ట్ మూవీగా ఈ సినిమా ఉంటుందనడంలో సందేహం లేదు . అయితే నా తదుపరి సినిమాతో తప్పకుండా మిమ్మల్ని అలరించే సినిమా చేస్తానని అన్నాడు శర్వా . అంటే ప్రెస్ మీట్ పెట్టి మరీ మా సినిమా ప్లాప్ అయ్యింది అని ఒప్పేసుకోవడం అన్నమాట . అంతరిక్షం , పడిపడి లేచె మనసు చిత్రాలు ఈనెల 21న విడుదలైన విషయం తెలిసిందే . అయితే రెండు కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి .

- Advertisement -

English Title: Sharwanand and Varun tej talk about failure movies

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All