Homeఎక్స్ క్లూసివ్శర్వానంద్ కు ఆ భామ కావాలట

శర్వానంద్ కు ఆ భామ కావాలట

వరుస విజయాలు సాధిస్తూ మంచి జోరు మీదున్నాడు హీరో శర్వానంద్ , తాజాగా సుధీర్ వర్మ దర్శకత్వంలో నటించడానికి అంగీకరించాడు త్వరలోనే ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది . ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటే బాగుంటుందని చాలామంది ని పరిశీలించారట అందరినీ అనుకున్న తర్వాత హలో చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన కళ్యాణి ప్రియదర్శన్ అయితే బాగుంటుందని ఫిక్స్ అయ్యాడట శర్వానంద్ , ఆ భామనే తీసుకుందామని చెప్పాడట , ఇప్పుడు దర్శక నిర్మాతలు ఆమెని ఎంపిక చేసే పనిలో పడ్డారు .

అఖిల్ హీరోగా నటించిన హలో చిత్రంలో హీరోయిన్ గా నటించింది కళ్యాణి ప్రియదర్శన్ . మాజీ హీరోయిన్ లిజి – దర్శకుడు ప్రియదర్శన్ ల కూతురు ఈ కళ్యాణి . దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న కళ్యాణ్ ని హీరోయిన్ గా చేసింది విక్రమ్ కే కుమార్ కాగా ఆ సినిమా అంతగా ఆడకున్నా కళ్యాణి కి మాత్రం చాలామంచి పేరు వచ్చింది దాంతో ఆమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి అయితే ఆఫర్లు వస్తున్నాయి కదా అని అన్ని ఒప్పుకోవడం లేదు ఈ భామ . మరి శర్వానంద్ కు ఓకే చెబుతుందా చూడాలి . 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All