Homeటాప్ స్టోరీస్శర్వానంద్ కొత్త సినిమా టైటిల్ ఏంటో తెలుసా

శర్వానంద్ కొత్త సినిమా టైటిల్ ఏంటో తెలుసా

sharwanand gets new titleవరుస విజయాలు సాధిస్తున్న శర్వానంద్ కాస్త వేగం తగ్గించాడు , సెలెక్టివ్ గా సినిమాలు ఎంపిక చేసుకుంటూ పోతున్నాడు . కాగా తాజాగా లై వంటి డిజాస్టర్ ఇచ్చిన హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ నటిస్తున్నాడు అనేసరికి అందరూ ఆశ్చర్య పోయారు , అయితే హను రాఘవపూడి లై అనే డిజాస్టర్ ఇవ్వొచ్చు కానీ అంతకంటే ముందే అందాల రాక్షసి , కృష్ణగాడి వీర ప్రేమ గాధ చిత్రాలను రూపొందించి అందరి ప్రశంసలు అందుకున్నాడు . దాంతో కావచ్చు లేదా హను చెప్పిన కథ బాగా నచ్చి కావచ్చు మొత్తానికి సినిమా చేస్తున్నాడు .

ఇక ఈ సినిమాకు పెట్టిన టైటిల్ ఏంటో తెలుసా ……… పడిపడి లేచే మనసు . అందాల భామ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది . ఈరోజు శర్వానంద్ పుట్టినరోజు కావడంతో ఈ కొత్త సినిమా టైటిల్ ని అలాగే లోగో ని విడుదల చేసారు . మొత్తానికి ఈ టైటిల్ చూస్తుంటే యువత ని బాగానే ఆకట్టుకునేలా కనబడుతోంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All