Homeటాప్ స్టోరీస్బిగ్ బ్రేకింగ్: క్రికెట్ లెజెండ్ షేర్ వార్న్ మృతి

బిగ్ బ్రేకింగ్: క్రికెట్ లెజెండ్ షేర్ వార్న్ మృతి

Shane Warne no more
Shane Warne no more

ఆస్ట్రేలియన్‌ క్రికెట్ లెజెండ్ షేర్ వార్న్ గుండెపోటు తో మరణించారు. ఈయన వయసు 52 . థాయ్‌లాండ్‌ లోని తన నివాసంలో విగతజీవిగా పడి ఉండటాన్ని చూసిన అతని సిబ్బంది వెంటనే హాస్పటల్ కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్స్ నిర్దారించారు. షేన్​వార్న్​ ఆస్ట్రేలియా తరఫున 45 టెస్టులు, 194 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 708 వికెట్లు, వన్డేల్లో 293 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఐదు వికెట్ల ఘనతను 37 సార్లు, 10 వికెట్ల ఘనతను 10 సార్లు అందుకున్నాడు. 194 వన్డేల్లో 293 వికెట్లు తీశాడు. 1992లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన షేన్ వార్న్.. 2007లో వీడ్కోలు పలికాడు.

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన షేన్ వార్న్ అరంగేట్ర సీజన్‌లోనే కెప్టెన్‌గా జట్టుకు టైటిల్ అందించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ జట్టు మరో టైటిల్ గెలవలేదు. 2011 వరకు రాజస్థాన్‌కు కెప్టెన్‌గా కొనసాగిన వార్న్..ఆ తర్వాత మెంటార్‌గా కూడా సేవలందించాడు. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం కామెంటేటర్‌గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన షేన్ వార్న్.. క్రికెట్ మ్యాచ్‌లపై ఎప్పటికప్పుడూ తన అభిప్రాయాలను పంచుకుంటూ అభిమానులతో టచ్‌లోనే ఉన్నాడు. షేర్ వార్న్ ఇకలేరు అనే వార్త క్రికెట్ అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఈ వార్తను తాను నమ్మలేకపోతున్నానని టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. జీవితమంటే ఇంతేనని, దానిని అర్థం చేసుకోవడం కష్టమన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతడి అభిమానులకు, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు పేర్కొన్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All