Homeటాప్ స్టోరీస్శైలజారెడ్డి అల్లుడు హిట్ అయ్యేలాగే ఉంది

శైలజారెడ్డి అల్లుడు హిట్ అయ్యేలాగే ఉంది

shailajareddy alludu trailer talkమొత్తానికి ఎన్నో అవాంతరాలను అధిగమించి శైలజారెడ్డి అల్లుడు ట్రైలర్ విడుదల అయ్యింది . 1 నిమిషం 49 సెకన్ల పాటు ఉన్న ఈట్రైలర్ చూస్తుంటే సినిమా వినోద ప్రధానంగా తెరకెక్కినట్లు తెలుస్తోంది . ఇక ఈ ట్రైలర్ తో శైలజారెడ్డి అల్లుడు హిట్ కావడం ఖాయమని అనిపిస్తోంది . ఇప్పటికే సరైన సినిమా ఏది లేదు బాక్సాఫీస్ వద్ద సరిగ్గా అలాంటి సమయంలో వస్తున్న శైలజారెడ్డి అల్లుడు బాక్సాఫీస్ ని కుమ్మేయడం ఖాయమని ధీమాగా ఉన్నారు ఆ చిత్ర బృందం .

రమ్యకృష్ణ , అక్కినేని నాగచైతన్య , అనుపమ పరమేశ్వరన్ నటించిన శైలజారెడ్డి అల్లుడు చిత్రానికి మారుతి దర్శకత్వం వహించగా నాగవంశీ – పిడివి ప్రసాద్ లు సంయుక్తంగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నిర్మించారు . గోపీసుందర్ అందించిన సంగీతం ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు ఆ చిత్ర బృందం . రమ్యకృష్ణ , అనుపమ పరమేశ్వరన్ లతో నాగచైతన్య ఆట ఎలా ఉందో తెలియాలంటే సెప్టెంబర్ 13 వరకు ఎదురు చూడాల్సిందే .

- Advertisement -

English Title: shailajareddy alludu trailer talk

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All