Homeఎక్స్ క్లూసివ్ఈ హీరో ఇప్పుడైనా కొడతాడా హిట్టు

ఈ హీరో ఇప్పుడైనా కొడతాడా హిట్టు

Shah rukh khan sensational comments on zero success
shahrukh khan and katrina kaif

షారుఖ్ ఖాన్ సాలిడ్ హిట్ కొట్టక 15 సంవత్సరాలు అవుతోంది . గత పదిహేనేళ్లుగా రకరకాల సినిమాలు చేస్తూనే ఉన్నాడు పరాజయాలను చవి చూస్తూనే ఉన్నాడు . అయితే ఈసారి మాత్రం తప్పకుండా హిట్ కొడతానన్న ధీమా వ్యక్తం చేస్తున్నాడు షారుఖ్ . ఈనెల 21న షారుఖ్ నటించిన ” జీరో ” చిత్రం విడుదలకు సిద్ధమైంది . దాంతో మీడియా ముందుకు వచ్చిన షారుఖ్ జీరో తో హీరో అవుతానని అంటున్నాడు .

అనుష్క శర్మకత్రినా కైఫ్ లు హీరోయిన్ లుగా నటించిన జీరో చిత్రం పై షారుఖ్ చాలా ఆశలే పెట్టుకున్నాడు . గతకొంత కాలంగా వరుసగా ఘోర పరాజయాలు ఎదురు అవుతుండటంతో సక్సెస్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నాడు . షారుఖ్ ఈ సినిమాలో మరుగుజ్జుగా నటించాడు . సినిమా హిట్ కావాలని అందరూ ఆశపడతారని , హిట్ అయితే సంతోషం వ్యక్తం చేస్తారని ఒకవేళ ఇది కూడా ప్లాప్ అయితే మాత్రం పది నెలల పాటు ఎవరికీ కనిపించనని ఇంట్లోనే ఉంటానని అంటున్నాడు . సాలిడ్ హిట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న షారుఖ్ ని నిజంగా హీరో ని చేస్తుందో జీరో ని చేస్తుందో మరో మూడు రోజుల్లోనే తేలిపోనుంది జీరో చిత్రంతో .

- Advertisement -

English Title: Shah rukh khan sensational comments on zero success

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All