Homeన్యూస్సేవ్ ది టైగర్స్ కు సీక్వెల్ త్వరలో ఉంటుంది: డైరెక్టర్ మహి వి రాఘవ !!!

సేవ్ ది టైగర్స్ కు సీక్వెల్ త్వరలో ఉంటుంది: డైరెక్టర్ మహి వి రాఘవ !!!

సేవ్ ది టైగర్స్ కు సీక్వెల్ త్వరలో ఉంటుంది: డైరెక్టర్ మహి వి రాఘవ !!!
సేవ్ ది టైగర్స్ కు సీక్వెల్ త్వరలో ఉంటుంది: డైరెక్టర్ మహి వి రాఘవ !!!

ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ, ‘జోర్దార్’ సుజాత, పావని గంగిరెడ్డి, దేవయాని, హర్షవర్ధన్, గంగవ్వ, వేణు టిల్లు, రోహిణి తదితరులు నటించిన వెబ్ సీరీస్ సేవ్ ది టీజర్స్. మహి వి. రాఘవ, చిన్నా వాసుదేవరెడ్డి నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సీరీస్ కు తేజ కాకుమాను దర్శకత్వం వహించారు అలాగే మహి వి. రాఘవ, ప్రదీప్ అద్వైతం ఈ సీరీస్ కు క్రీయేటర్స్ గా ఉన్నారు.

సేవ్ ది టైగర్స్ సీరీస్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి పాజిటీవ్ రెస్పాన్స్ వస్తోన్న సందర్భంగా దర్శకులు మహి వి రాఘవ మీడియా సమావేశం అయ్యారు.

- Advertisement -

ఈ సందర్భంగా దర్శకులు మహి వి రాఘవ మాట్లాడుతూ…
సేవ్ ది టైగర్స్ కు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఒక మంచి సీరీస్ తీశామనే తృప్తి ఉంది. ఫన్ ఎలిమెంట్స్ బాగా కనెట్స్ అయ్యాయి, అందరూ బాగా చేశారు. ఈ సీరీస్ కు మంచి ఆదరణ లభించింది అందరూ సీరీస్ కు సీక్వెల్ ఎప్పుడూ అని అడుగుతున్నారు త్వరలో సీరీస్ 2 షూట్ ప్లాన్ చేస్తున్నాము.

మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని సేవ్ ది టైగర్స్ నిరూపించింది. హాట్ స్టార్ లో సేవ్ ది టైగర్స్ చూసిన అందరూ మెచ్చుకుంటున్నారు. కనెక్ట్ అవుతున్నారు. మరిన్ని మంచి ప్రాజెక్ట్స్ చెయ్యడానికి ఈ సీరీస్ హెల్ప్ అయ్యింది.

త్వరలో సైతాన్ అనే కొత్త వెబ్ సీరీస్ తో రాబోతున్నాను. అది డిఫరెంట్ జానర్ లో ఉంటుంది. వచ్చే నెలలో ఆ సీరీస్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అలాగే సిద్దా లోకం ఎలా ఉంది నాయనా అనే సినిమా కూడా చిత్రీకరణ పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీగా ఉంది, శ్రద్ధ శ్రీనాధ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. అలాగే యాత్ర 2 స్క్రిప్ట్ వర్క్స్ జరుగుతున్నాయి, త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All