Homeటాప్ స్టోరీస్జనవరి 10 అంటే మహేష్, త్రివిక్రమ్ కి ఎందుకంత భయం?

జనవరి 10 అంటే మహేష్, త్రివిక్రమ్ కి ఎందుకంత భయం?

sentiment behind january 12 release of sarileru neekevvaru and ala vaikunthapuramlo
జనవరి 10 అంటే మహేష్, త్రివిక్రమ్ కి ఎందుకంత భయం?

మొత్తానికి సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల జాబితా, ఆ రిలీజ్ డేట్ లు వచ్చేసాయి. జనవరి 10న దర్బార్ విడుదలవుతుంటే, జనవరి 12న సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో చిత్రాలు రిలీజ్ అవ్వనున్నాయి. జనవరి 14న వెంకీ మామ వస్తోంది. జనవరి 15న ఎంత మంచివాడవురాను రిలీజ్ చేస్తున్నారు. సంక్రాంతి జనవరి 15న అయింది. అందుకని పండగ ముందు పెద్ద చిత్రాల రిలీజ్ ని ప్లాన్ చేసారు.

అయితే ఇక్కడ ఒకటి గమనించాలి. జనవరి 12 ఆదివారం అయింది. జనవరి 10 శుక్రవారం. 12 కంటే 10న చిత్రాన్ని విడుదల చేసుకుంటే సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో చిత్రాలకు లాభం ఎక్కువ. కనీసం ఒక్కరైనా 10న రావొచ్చు. కానీ ఎందుకు జనవరి 10 అంటే అంత భయపడుతున్నారు? దానికి కారణం కూడా లేకపోలేదు.

- Advertisement -

మహేష్ కెరీర్ లో డిజాస్టర్స్ లో ఒకటైన 1 నేనొక్కడినే జనవరి 10నే విడుదలైంది. త్రివిక్రమ్ కెరీర్ లో మాయని మచ్చగా మిగిలిపోయిన అజ్ఞాతవాసి కూడా జనవరి 10నే విడుదలైంది. ఈ సెంటిమెంట్ తో అటు మహేష్, ఇటు త్రివిక్రమ్ జనవరి 10న వద్దని అనుకున్నారు. సరే, జనవరి 10 వొద్దు. మరి జనవరి 11న విడుదల చేసుకోవచ్చు కదా? ఎందుకని పంతంగా ఇద్దరూ ఒక్కరోజే వస్తున్నారు?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All