Homeటాప్ స్టోరీస్జాతీయ అవార్డ్ గ్ర‌హీత‌.. సిరిసిరిమువ్వ‌ ఎడిటర్ కె బాబురావు కన్నుమూత..

జాతీయ అవార్డ్ గ్ర‌హీత‌.. సిరిసిరిమువ్వ‌ ఎడిటర్ కె బాబురావు కన్నుమూత..

senior film editor baburao no moreక‌ళాత‌ప‌స్వి కే విశ్వ‌నాథ్ గారి ద‌గ్గ‌ర కొన్ని సినిమాల‌కు ఎడిట‌ర్ గా ప‌ని చేసిన కె బాబురావు గారు చెన్నైలో క‌న్నుమూసారు. కొన్ని రోజులుగా ఈయ‌న అనారోగ్యంతో బాధ ప‌డుతున్నారు. ఒక‌ప్పుడు క‌ళాత‌ప‌స్వి సినిమాల‌కు త‌న‌దైన శైలిలో ఎడిటింగ్ చేసారు బాబురావు.

ఈయ‌న ఎడిట్ చేసిన సిరిసిరిమువ్వ సినిమాకు గానూ ఉత్తమ ఎడిట‌ర్ గా జాతీయ అవార్డ్ కూడా అందుకున్నారు బాబురావు. ఆ త‌ర్వాత కూడా విశ్వ‌నాథ్ గారితో ఆయ‌న సాన్నిహిత్యం సాగింది. ప‌లు హిందీ సినిమాల‌కు కూడా ఈయ‌న ఎడిటర్ గా ప‌ని చేసారు. బాబురావు మృతిపై ద‌క్షిణాది ఇండ‌స్ట్రీ సంతాపం తెలియ‌చేసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All