Homeటాప్ స్టోరీస్చిరంజీవి సినిమా టైటిల్ విషయంలో నోరు జారిన డాన్స్ మాస్టర్

చిరంజీవి సినిమా టైటిల్ విషయంలో నోరు జారిన డాన్స్ మాస్టర్

sekhar master revel chiru 154 title
sekhar master revel chiru 154 title

ప్రస్తుతం టాలీవుడ్ డాన్స్ మాస్టర్ లలో బిజీ గా ఉన్న మాస్టర్ శేఖర్ మాస్టర్. ఢీ షో తో గుర్తింపు తెచ్చుకున్న శేఖర్..ఆ తర్వాత సినిమాల్లో ఛాన్స్ కొట్టేసి..ప్రస్తుతం అగ్ర హీరోల దగ్గరి నుండి చిన్న హీరోల సినిమాల వరకు వరుస సినిమాలతో బిజీ గా ఉన్నారు. తాజాగా ఈయన ఆచార్య సినిమాకు పనిచేసారు. రీసెంట్ గా ఆచార్య నుండి వచ్చిన భలే భలే సాంగ్ కు శేఖర్ కొరియోగ్రఫీ చేసారు. ఈ సాంగ్ లో చిరంజీవి , చరణ్ ల చేత అదిరిపోయే స్టెప్స్ వేయించినట్లు తెలుస్తుంది.

కాగా ఈ సాంగ్ రిలీజ్ సందర్బంగా మీడియా తో ముచ్చటిస్తూ..చిరు 154 మూవీ తాలూకా టైటిల్ ను రివీల్ చేసి షాక్ ఇచ్చాడు. యంగ్ డైరెక్టర్ కె.ఎస్. రవీంద్ర (బాబీ) రూపొందిస్తున్న ఈ చిత్రం మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నిర్మితం అవుతోంది. ఇందులో చిరు సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా చేస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు. మాస్ మసాలా ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ప్రముఖ హీరో రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే వాల్తేరు వీరయ్య , వాల్తేరు వీరన్న , మాస్ మూల విరాట్ ఇలా పలు టైటిల్స్ తెరపైకి వచ్చాయి. కానీ చిత్ర టీమ్ మాత్రం టైటిల్ ను రివిల్ చేయకుండా సస్పెన్స్ ను కొనసాగిస్తోంది. అయితే ఇలాంటి సమయంలో శేఖర్ మాస్టర్ ‘మెగా 154’ టైటిల్ ను లీక్ చేసేశారు.

- Advertisement -

తాజాగా ఓ ఇంటర్వ్యూలో శేఖర్ ను యాంకర్ మీ అప్ కమ్మింగ్ ప్రాజెక్ట్స్ ఏంటంటూ ప్రశ్నించగా.. అందుకు శేఖర్ మాస్టర్ బదులిస్తూ.. ‘ రవితేజగారు నటిస్తున్న ధమాకా రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు చేస్తున్నాను తమళంలో రెండు ప్రాజెక్ట్ లు అలాగే చిరంజీవిగారితో భోళా శంకర్ , వాల్తేరు వీరయ్య చిత్రాలు చేస్తున్నా ‘ అంటూ నోరు జారారు. దీంతో మెగా 154 టైటిల్ ‘వాల్తేరు వీరయ్య’ అని కన్ఫార్మ్ అయిపోయింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All