
ఈ మధ్య థియేటర్స్ లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండగానే ఓటిటిలో రిలీజ్ అవుతున్నాయి. చిన్న , పెద్ద సినిమాలతో పాటు భారీ బడ్జెట్ చిత్రాలు సైతం నెల రోజులు తిరిగే లోపు ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. తాజాగా అబ్బవరం కిరణ్ నటించిన ‘సెబాస్టియన్ పీసీ 524’ ఓటిటి లో సందడి చేసేందుకు సిద్ధమైంది.
‘రాజావారు రాణిగారు’ .. ‘ఎస్.ఆర్. కల్యాణ మంటపం’ వంటి సినిమాలతో వరుస విజయాలు అందుకొని, యూత్ ను ఆకట్టుకున్నకిరణ్ అబ్బవరం తాజాగా ‘సెబాస్టియన్ PC 524’ మూవీ తో మర్చి 04 న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రాజు – ప్రమోద్ నిర్మించిన ఈ సినిమాకి బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించాడు. కిరణ్ అబ్బవరం సరసన నాయికలుగా నువేక్ష .. కోమలి ప్రసాద్ కనువిందు చేసారు. సినిమా బాగున్నప్పటికీ రిలీజ్ టైం బాగుండకపోయేసరికి బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయలేకపోయింది. ఈ క్రమంలో ఇప్పుడు ప్రముఖ ఓటీటీ దిగ్గజం ఆహా లో మార్చి 18 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.