Homeటాప్ స్టోరీస్`స‌వారి` మూవీ రివ్యూ

`స‌వారి` మూవీ రివ్యూ

`స‌వారి` మూవీ రివ్యూ
`స‌వారి` మూవీ రివ్యూ

నటీన‌టులు: న‌ందు, ప్రియాంక‌శ‌ర్మ‌, శ్రీ‌కాంత్ గంట‌, శివ‌కుమార్‌, మ‌ది త‌దిత‌రులు న‌టించారు.
క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: సాహిత్ మోత్కూరి
నిర్మాత‌: స‌ంతోష్ మోత్కూరి, నిశాంక్‌రెడ్డి కుడితి
సంగీతం: శేఖ‌ర్‌చంద్ర‌
సినిమాటోగ్ర‌ఫీ: మోనిష్ భూప‌తిరాజు
ఎడిటింగ్: స‌ంతోష్ మేన‌మ్‌
రిలీజ్ డేట్‌: 07-02- 2020
రేటింగ్: 2/5

100 % ల‌వ్‌, పెళ్లిచూపులు వంటి హిట్ చిత్రాల్లో న‌టించిన నందుకు సోలో హీరోగా ఎంత ప్ర‌య‌త్నించినా ఫ‌లితం లేకుండా పోయింది. క్రేజీ ద‌ర్శ‌కుడు వ‌ర్మ‌తో 2015లో చేసిన 365 డేస్ కూడా నందూని హీరోగా నిల‌బెట్ట‌లేక‌పోయింది. దీంతో హీరోగా కొంత గ్యాప్ తీసుకున్న నందు తాజాగా కొత్త త‌ర‌హా క‌థ‌ `స‌వారి`తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. `బంధం రేగ‌డ్‌`అనే షార్ట్ స్టోరీ మూవీతో సైమా అవార్డుని సొంతం చేసుకున్న సాహిత్ మోత్కూరి ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ప్రియాంక శ‌ర్మ హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయిన ఈ చిత్రం ఈ శుక్ర‌వారం విడుద‌లైంది. నందు పెట్టుకున్న ఆశ‌ల్నిఈ సినిమా ఎంత వ‌ర‌కు నిజం చేసింది?. ఆక‌ట్టుకుందా? లేక ఎప్ప‌టిలాగే నిరాశ ప‌రిచిందా అన్న‌ది తెలియాలంటే క‌థ‌లోకి వెళ్లాల్సిందే.

- Advertisement -

క‌థ‌:
రాజు (నందు) స్ల‌మ్ ఏరియాలో నివసించే ఓ మ‌ధ్య త‌ర‌గ‌తి యువ‌కుడు. అత‌నికి ఓ గుర్రం ( బాద్ షా ) వుంటుంది. దాని ఆధారంగా జీవనం కొన‌సాగిస్తుంటాడు. హ‌ఠాత్తుగా త‌న బాద్ షాకు విప‌త్క‌ర ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. దాని నుంచి బాద్ షాను కాపాడు కోవాల‌ని రాజు డ‌బ్బులు పోగేస్తుంటాడు ఈ క్ర‌మంలోనే అత‌నికి భాగీ (ప్రియాశ‌ర్మ‌)తో ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. ఆ ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌గా మారుతుంది. ఇదే స‌మ‌యంలో రాజు బాద్ షా క‌నిపించ‌కండా పోతుంది. ఇంత‌కీ భాగీ ఎవ‌రు? బాద్ షా క‌నిపించ‌కుండా పోవ‌డానికి గ‌త కార‌ణం ఏంటీ? రాజు చివ‌రికి బాద్ షా ఎక్క‌డుందో క‌నుక్కున్నాడా? భాగీతో రాజు ప్రేమ ఎలాంటి మ‌లుపులు తిరిగింది? చివ‌రికి ఎలా సుఖాంత‌మైంది అన్న‌ది అస‌లు క‌థ‌.

న‌టీన‌టులు:
నందు ఇప్ప‌టి వ‌ర‌కు హీరో, హీరో ఫ్రెండ్‌గా ప‌లు పాత్ర‌ల్లో న‌టించాడు కానీ కెరీర్ ప‌రంగా అత‌నికి రాజు పాత్ర మంచి పేరుని తెచ్చిపెడుతుంది. సినిమా ఫ‌లితం ఎలా వున్నా నందు పాత్ర‌ని డిజైన్ చేసిన తీరు అత‌నిలో మంచి న‌టుడు ఉన్నాడ‌ని ఈ సినిమాతో ప్రతీ ఒక్క‌రికీ అర్థ‌మ‌వుతుంది. ఇక హీరోయిన్ ప్రియాంక శ‌ర్మ పాత్ర ప‌రిధిమేర‌కు న‌టించి ఆక‌ట్టుకుంది. శ్రీ‌కాంత్ గంట‌, శివ‌కుమార్‌, మ‌ది త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించి ఆక‌ట్టుకున్నారు. మిగ‌తా వారి గురించి చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే చెప్పుకోద‌గ్గ న‌టీన‌టులు ఇందులో ఎవ‌రు లేరు కాబ‌ట్టి.

సాంకేతిక నిపుణులు:
ఇలాంటి చిన్న చిత్రానికి ప్ర‌ధానంగా క‌థ కీల‌కం. కానీ క‌థ‌లో ఎలాంటి ద‌మ్ములేదు. రోటీన్ క‌థే. ఇలాంటి రొటీన్ క‌థ‌కి శేక‌ర్ చంద్ర సంగీతం, మోనిష్ భూప‌తిరాజు సినిమాటోగ్ర‌ఫీ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. నేప‌థ్య సంగీతం, సాంగ్స్‌తో శేఖ‌ర్ చంద్ర ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేయ‌గా, మోనిష్ భూప‌తిరాజు త‌న‌ సినిమాటోగ్ర‌ఫీతో మ‌రింత అందంగా మ‌లిచారు. ఒక విధంగా చెప్పాలంటే అవుట్ పుట్ విష‌యంలో శేఖ‌ర్ చంద్ర‌, మోనిష్ భూప‌తిరాజు పోటీప‌డ్డారు. రొటీన్ ల‌వ్‌స్టోరీని తీసుకుని దానికి గుర్రం సెంటిమెంట్‌ని యాడ్ చేసి కొత్త క‌థ చెబుతున్న‌ట్టుగా క‌ల‌రింగ్ ఇచ్చాడు ద‌ర్శ‌కుడు. క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం వంటి మూడు విభాగాల్ని భుజాన వేసుకున్నా అందులో ఏ ఒక్క దానికి సంపూర్ణ న్యాయం చేయ‌లేక‌పోయాడు. దీంతో సినిమా రొటీన్ సినిమాగానే మిగిలిపోయింది.

విశ్లేష‌ణ‌:
ట్రైల‌ర్‌తో ఆక‌ర్షించిన `స‌వారి` తెర‌పైకి వ‌చ్చే సరికి స‌గ‌టు ప్రేక్ష‌కుడికి నీర‌సాన్ని తెచ్చించింది. ట్రైల‌ర్‌లో వున్న కంటెంట్ కి మించి సినిమాలో ఏమీ లేక‌పోవ‌డం పెద్ద మైన‌స్‌. పాత క‌థ‌నే వండి వార్చి దానికి గుర్రాన్ని జోడించి ఏదో ప్ర‌యోగం చేస్తున్నాం అన్న‌ట్టుగా క‌ల‌రింగ్ ఇచ్చారు. కానీ అదే ఈ సినిమాకి బెడిసికొట్టింది. ట్రైల‌ర్‌లో ఎంత ఆశ పెట్టారో సినిమాలో ఆ విష‌యం లేక‌పోవ‌డం.. రొటీన్ క‌థ‌నే సినిమాకి ఎంచుకోవ‌డంతో `స‌వారి` ఏ స్థాయిలోనూ స‌గ‌టుప్రేక్ష‌కుడిని ఆక‌ట్టుకోలేక‌పోయింది. చిన్ని సినిమా కోసం ప్రేక్ష‌కుడు థియేట‌ర్‌కు రావ‌డ‌మే గ‌గ‌న‌మైపోయిన ఈ రోజుల్లో ఇలాంటి నొటీన్ క‌థ కోసం ప్రేక్ష‌కులు ఆశ‌గా థియేట‌ర్‌కి వ‌స్తార‌న్న‌ది క‌ల్లే.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All